అల్లు అర్జున్ తరువాత ఆ హీరోకి భారీ క్రేజ్.. నార్త్ ఆడియెన్స్ ఫిదా!
టాలీవుడ్ సినిమాలకు ఈ మధ్య కాలంలో నార్త్ ఆడియెన్స్ నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు గట్టిగానే క్లిక్కవుతున్నాయి. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే చాలు యూ ట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి. తెలుగులో డిజాస్టర్ అయిన సినిమాలను కూడా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా హిందీ ఆడియెన్స్ వీక్షిస్తున్నారు.
ఒక్కసారి గనక ఒక హీరోకి నార్త్ ఆడియెన్స్ నుంచి క్రేజ్ దక్కింది అంటే చాలు ఇక నెక్స్ట్ సినిమాలకు కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే అల్లు అర్జున్ సినిమాలకు హిందీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు బన్నీ తరువాత యూ ట్యూబ్ లో ఎక్కువగా బెల్లంకొండ సినిమాలకు మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక సినిమాను హిందీలో ఖూన్కర్ అనే టైటిల్ తో డబ్ చేయగా యూ ట్యూబ్ లో ఆ సినిమా టాప్ సెకండ్ మూవీగా నిలిచింది. సరైనోడు 305 మిలియన్ వ్యూవ్స్ అందుకోగా బెల్లంకొండ మూవీ 300మిలియన్ వ్యూవ్స్ అందుకుంది. అత్యదిక వ్యూవ్స్ అందుకున్న సెకండ్ ఇండియన్ మూవీ ఇదే. బెల్లంకొండ కవచం సినిమా కూడా 200M+ వ్యూవ్స్ అందుకోగా.. అల్లుడు శీను 100M+వ్యూవ్స్ తో మంచి క్రేజ్ అందుకున్నాయి.


Click it and Unblock the Notifications











