క్రేజీ న్యూస్: ప్రభాస్, చరణ్ తర్వాత విజయ్ దేవరకొండ.. అలా ఫిక్స్ అయిపోయిన రౌడీ స్టార్.!

By Manoj

చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అతడు.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు'తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు విజయ్‌ కెరీర్‌కు గట్టి పునాదిని వేసింది. ఇక, 'అర్జున్ రెడ్డి'తో అతడికి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన 'గీత గోవిందం', 'టాక్సీవాలా' చిత్రాలు ఈ రౌడీ స్టార్‌కు ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం అతడు ఓ సినిమా చేస్తున్నాడు. మరో దానిని లైన్‌లో పెట్టేశాడు. ఈ నేపథ్యంలో విజయ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

అంచనాలను అందుకోలేదు.. కానీ పేరొచ్చింది

అంచనాలను అందుకోలేదు.. కానీ పేరొచ్చింది

విజయ్ దేవరకొండ గత ఏడాది ‘డియర్ కామ్రేడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భరత్ కమ్మ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అదే సమయంలో ఇందులో విజయ్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

గొప్ప లవర్ అనిపించుకోవాలని ప్రయత్నం

గొప్ప లవర్ అనిపించుకోవాలని ప్రయత్నం


ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్‌, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా లవర్స్ డే రోజున విడుదల కానుంది.

మళ్లీ అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్నాడు

మళ్లీ అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్నాడు

ఇటీవల విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో నటిస్తున్న నలుగురు హీరోయిన్ల పాత్రలను, విజయ్ నాలుగు వేరియేషన్లను చూపించారు. అంతేకాదు, ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అందరికీ ‘అర్జున్ రెడ్డి' గుర్తొస్తుంది. ఇందులో కొన్ని షాట్స్ ఆ సినిమాలో సన్నివేశాలను గుర్తు చేస్తున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

డైనమిక్ డైరెక్టర్‌తో సినిమా ప్రకటన

డైనమిక్ డైరెక్టర్‌తో సినిమా ప్రకటన


‘వరల్డ్ ఫేమస్ లవర్' షూటింగ్ జరుగుతుండగానే విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘ఫైటర్' అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్, చరణ్ తర్వాత విజయ్ దేవరకొండ

ప్రభాస్, చరణ్ తర్వాత విజయ్ దేవరకొండ

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడట. అందుకోసం బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ పని చేయబోతున్నారట. ఈయన గతంలో ‘సాహో' కోసం ప్రభాస్‌తో పని చేశాడు. అలాగే, ప్రతిష్టాత్మక చిత్రం RRR కోసం రామ్ చరణ్‌కు మేకొవర్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X