twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాయ్‌ కాట్‌ ట్రెండ్‌పై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.. లాల్ సింగ్ చడ్డా అందుకే ఆడలేదు అంటూ..

    |

    బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో వరుసగా పెద్ద సినిమాలు దారుణమైన అపజయాలను ఎదుర్కొంటున్నాయి. అగ్ర హీరోల సినిమాలు కూడా ఊహించని విధంగా నష్టాలను కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎక్కువగా బాయ్ కాట్ అనే ట్యాగ్స్ వైరల్ కావడం వలన సినిమా నష్టాలు వచ్చినట్లుగా పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో నాగార్జున చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    సినిమాపై ప్రభావం

    సినిమాపై ప్రభావం

    ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను కలుగజేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమాకు బాయ్ కాట్ నెగిటివ్ ట్యాక్స్ ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ఆమీర్ ఖాన్ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ పైన నెటిజన్లు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేశారు.

    ఆ సినిమాలపై కూడా

    ఆ సినిమాలపై కూడా

    అయితే లాల్ సింగ్ చడ్డా సినిమా ఫ్లాగ్ కావడానికి బాయికాట్ ట్రెండ్ కూడా ఒక కారణమని కొందరు కామెంట్ చేస్తున్నప్పటికీ కాంటెంట్ ఉంటేనే ఏ సినిమా అయినా క్లిక్ అవుతుందమి మరికొందరు అంటున్నారు. కేవలం ఈ సినిమాకు మాత్రమే కాకుండా రక్షాబంధన్, గంగుభాయ్ ఖతీయవాడి సినిమాలకు కూడా బాయ్ కాట్ ఇబ్బందులు ఎదురయ్యాయ. ఇక అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ బాయ్ కాట్ పై విభిన్నంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

    నాగార్జున క్లారిటీ

    నాగార్జున క్లారిటీ

    ఇక రీసెంట్ గా నాగార్జున ఈ బాయ్ కాట్ ట్రెండింగ్ పై తనదైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఆయన నటించిన బ్రహ్మాస్త్ర సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ విషయంపై మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వచ్చిన గంగుబాయి ఖతీయవాడి, బుల్ బులియ 2, RRR సినిమాలు మంచి కంటెంట్ ఉండడం వల్లనే సక్సెస్ అయ్యాయి.. కానీ లాల్ సింగ్ చడ్డా ఆడలేదు. కానీ బ్రహ్మాస్త్ర మాత్రం బాగా ఆడుతోంది అని అన్నారు. ఇక ఇన్ డైరెక్ట్ గా నాగ్ లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ అని క్లారిటీ అయితే ఇచ్చేశారు.

     కంటెంట్ ఉంటేనే..

    కంటెంట్ ఉంటేనే..

    బాయ్ కాట్ ట్రెండ్ అనేది సినిమా పరిశ్రమను పెద్దగా ప్రభావితం చేయలేదు అని సోషల్ మీడియాలో అలాగే ఇంటర్నెట్లో నెగటివ్ ట్రెండ్ చేసినంత మాత్రాన కూడా సినిమా విజయం సాధించకుండా ఉండదు అని మంచి కంటెంట్ ఉంటేనే సినిమాలు సక్సెస్ అవుతాయి అని నాగార్జున వివరణ ఇచ్చాడు. ఏదేమైనా కూడా బాయ్ కాట్ అనేది మేటర్ కూడా కాదు అని అన్నారు. ఇక నాగార్జున బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్ లో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Akkineni nagarjuna clarification on social media boycott trending..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X