For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో హీరో సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్.. అతని కోసం తప్పట్లేదు?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యువ హీరోలలో ఒకరైన అల్లరి నరేష్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉండేవారు. ఒకప్పటి కామెడీ దర్శకుడు సత్యనారాయణ వారసుడిగా అల్లరి నరేష్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అన్నయ్య రాజేష్ అంతగా సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ నరేష్ మాత్రం తండ్రి సపోర్ట్ తో అనేక రకాల కామెడీ సినిమాలు చేశాడు కెరీర్ మొదట్లో మినిమం బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న అల్లరినరేష్ తండ్రి మరణం తర్వాత కొంత డీలా పడ్డాడానే చెప్పాలి. మొదట్లో ప్లాప్స్ వచ్చినప్పుడు వెంటనే తండ్రి దర్శకత్వంలో మరో సినిమా చేసే నరేష్ ఫామ్ లోకి వచ్చేవాడు.

  ఈవివి సత్యనారాయణ మరణం తర్వాత నరేష్ ట్రాక్ తప్పినట్లు వరుస డిజాస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది .ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నరేష్ మాత్రం స్లో అవ్వడం లేదు. వీలయినంతవరకు కామెడీ సినిమాలతోపాటు విభిన్నమైన సినిమాలను కూడా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఏడాది నాంది సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా కేవలం కలెక్షన్స్ ను పెంచడం మాత్రమే కాకుండా నరేష్ నటనకు కూడా మంచి గుర్తింపును అందించింది. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా అదే తరహాలో ఉండాలని నరేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

  Allari naresh special role in manchu manoj upcoming big project

  అయితే ఆ మధ్య మహేష్ బాబు మహర్షి సినిమాలో ఒక కీలకమైన స్నేహితుడు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు నరేష్ పాత్ర చాలా బాగా హెల్ప్ అయ్యింది. మంచి పాత్రలు వస్తే సపోర్ట్ రోల్స్ చేయడానికి తాను సిద్ధమేనని నరేష్ ఆ సినిమాతో నిరూపించాడు. మహర్షి సినిమా అనంతరం కూడా అల్లరి నరేష్ కు అలాంటి ఆఫర్స్ కొన్ని వచ్చాయట. కానీ కథ నచ్చక పోవడం వలన రిజెక్ట్ చేసినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో తనకు మంచి స్నేహితుడు అయినటువంటి యువ హీరో కోసం మరో గెస్ట్ రోల్ చేయడానికి నరేష్ ఒప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

  ఆ హీరో మరెవరో కాదు. అల్లరి నరేష్ కెరీర్ మొదటి నుంచి కూడా మంచి ఫ్రెండ్ అయినటువంటి మంచు మనోజ్. ఈ హీరో కూడా గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా అహం బ్రహ్మాస్మి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అల్లరి నరేష్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎమోషనల్ గానే కాకుండా కాస్త కామెడీగా కూడా ఉండేలాగా ఆ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాక్ అయితే వస్తుంది. మరి ఇది వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  అహం బ్రహ్మాస్మి సినిమా మంచు మనోజ్ తన సొంత ప్రొడక్షన్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక పోతే వచ్చే ఏడాది మాత్రం తప్పకుండా రిలీజ్ చేయవచ్చని సమాచారం..

  ఇక అల్లరి నరేష్ సినిమాల విషయానికి వస్తే వరుస పరాజయాల అనంతరం మొత్తానికి నాంది సినిమాతో అయితే ఫామ్ లోకి వచ్చేశాడు. నెక్స్ట్ డిఫరెంట్ జానర్ టచ్ చేస్తూ సభకు నమస్కారం అని సినిమాతో రాబోతున్నాడు అలాగే మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ గతంలో మాదిరిగా కామెడీ సినిమాలు ఎక్కువగా చేయకుండా మధ్య మధ్యలో కాస్త డిఫరెంట్ సినిమాలను, కంటెంట్ ఉన్న కథలను టచ్ చేయాలనుకుంటున్నాడు. అలాగే పెద్ద దర్శకులతో కూడా సినిమాలు చేయాలని ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో నరేష్ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

  English summary
  Tollywood young hero Allari naresh special role in manchu manoj upcoming big project,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X