Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 3 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్, ఎన్టీఆర్‌లకు తొందరగానే దక్కింది.. నాకు మాత్రం 20 తరువాత.. నేనేంటో చూపిస్తా: అల్లు అర్జున్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ అందుకున్న సినిమాల్లో 'అల.. వైకుంఠపురములో..' ఒకటి. దాదాపు ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డులను అందుకుంది. ఇక నిన్నటితో ఆ సినిమా విడుదలై కరెక్ట్ గా ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం మళ్ళీ రీ యూనియన్ ను హైదరాబాద్ లోని అల్లు వారి ఆఫీస్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ కొంత ఎమోషనల్ గా మాట్లాడాడు.

అప్పుడే హిట్ పడుతుందని అనుకున్నారు
అల.. వైకుంఠపురములో సినిమా బన్నీకి మరచిపోలేని ఒక బిగ్ బ్లాక్ బస్టర్ ను అందించిందనే చెప్పాలి. ఆ మధ్య బద్రీనాథ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోవడం కాయమని అంతా అనుకున్నారు. బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేకుండా ఖర్చు చేశారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక 2020 సంక్రాంతికి వచ్చిన అల.. మాత్రం నెవర్ బిఫోర్ అనేలా వండర్ క్రియేట్ చేసింది.

2020 బ్యాడ్ ఇయర్ కాదు
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గత ఏడాది సంక్రాంతి తరువాత 2020 అనేది ప్రపంచానికి చాలా బ్యాడ్ ఇయర్ గా నడిచింది. అయితే నాకు మాత్రం అలా కాదు. నేను బ్యాడ్ ఇయర్ అని చెప్పలేను. ఎందుకంటే నా లైఫ్ మొత్తంలో ఇలాంటి విజయాన్ని నేను చూడలేదు. సినిమా విడుదలై ఏడాది అయినా ఇంకా ఏదో ఒక విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది.

అప్పుడు రిలీజ్ చేసి ఉంటే..
ఒకవేళ సినిమాను సంక్రాంతికి కాదని సమ్మర్ లో విడుదల చేసి ఉంటే ఈ స్థాయిలో విజయాన్ని అందుకొని ఉండేది కాదేమో. కోవిడ్ కు ముందు ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చున్నాను. ఆ తరువాత కూడా మళ్లీ ఇంట్లోనే కూర్చున్నాను. కానీ ఈ మధ్యలో వచ్చిన అల.. వైకుంఠపురములో విజయం ఎంతగానో ఎనర్జీని ఇచ్చింది.

నేనేంటో చూపిస్తాను
ఇక ప్రతి నటుడికి ఎదో ఒక సమయంలో ఆల్ టైమ్ రికార్డ్ పడుతూ ఉంటుంది. జర్నీలో బ్యూటీఫుల్ మైల్ స్టోన్స్ వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఏడు సినిమాల తరువాత బిగెస్ట్ హిట్ ఖుషి. ఇక దాదాపు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఎడవదే. ఇక చరణ్ కు రెండవ సినిమా. అందరికి ఆల్ టైమ్ రికార్డ్ తొందరగానే వచ్చింది. నాకు మాత్రం 20సినిమాలు పట్టింది.. ఇది నా మొదటి అడుగు.. ఇక నేనేంటో చూపిస్తాను అంటూ.. బన్నీ వివరణ ఇచ్చాడు.