Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
షూట్ కోసం విదేశాలకు అల్లు అర్జున్.. కానే అసలు ట్విస్ట్ అదే!
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ నార్త్ లో కూడా మార్మోగిపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందని ప్రేక్షకులు అందరిలో కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే పుష్ప 2 సినిమా షూటింగ్ కంటే ముందే అల్లు అర్జున్ షూటింగ్ లో హాజరు కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ అంతకంతకు పెరుగుతున్న కారణంగా ఆయనతో వివిధ సంస్థలు ఒప్పందాల కుదుర్చుకుని తమ బ్రాండ్లకు అంబాసిడర్ గా నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ ఇప్పటికే చేసిన రాపిడో యాడ్, జొమాటో యాడ్లు వివాదానికి కారణమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన వివాదానికి తావివ్వకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి టాంజానియా అనే దేశంలో ఉన్నారు. మరో వారం రోజుల్లో ఆయన తన ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన కోలా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని దానికి సంబంధించిన యాడ్ షూటింగ్ బ్యాంకాక్ లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది, రెండు మూడు రోజులపాటు జరగనున్న ఈ యాడ్ షూటింగ్ తర్వాత ఆయన తిరిగి భారతదేశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి పుష్ప సీక్వెల్ను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని రంగం సిద్ధం చేసుకున్నారు.

కానీ బాలీవుడ్ లో నార్త్ సినిమాలకు ఏర్పడుతున్న క్రేజ్ కారణంగా సినిమా బడ్జెట్ పెంచి కథకు కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పటికే ఉన్న కథ కాకుండా సుకుమార్ దాన్ని కాస్త మార్చి నార్త్ ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నార్త్ లో కూడా మంచి క్రేజ్ దక్కించుకున్న సౌత్ నటీనటులను కూడా నటింప చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మొదటి భాగంలో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది కానీ అప్పట్లో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలోనే ఫహద్ ఫాజుల్ ను తీసుకువచ్చి మెయిన్ విలన్ గా నటింపజేశారు. ఇప్పుడు రెండో భాగంలో కూడా విజయ్ సేతుపతిని నటింప చేయడానికి మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఏ మేరకు నిజాలు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.