twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు రాష్ట్రాల్లో అక్కినేని ఫ్యాన్స్ నిరసనలు...బాలయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఆగ్రహం!

    |

    టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటీవల వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. తోటి ఆర్టిస్టులతో వివిధ రకాల విషయాల గురించి మాట్లాడుకుంటామని వివరణ ఇస్తూ వచ్చిన బాలయ్య బాబు హఠాత్తుగా అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడిన విధానంపై ఓవర్గం అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు.

    ఇక సోషల్ మీడియా ద్వారా అక్కినేని యువ హీరోలు అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా సీనియర్ నటులను గౌరవించుకోకపోతే మనల్ని మనం అగౌరవపరచుకున్నట్లే అని సున్నితంగా బాలయ్య బాబు కామెంట్లకు కౌంటర్ అయితే ఇచ్చారు. ఇక ANR అభిమానులు కూడా తీవ్రస్థాయిలో మరింత నిరసనలను వ్యక్తం చేస్తూ ఉండడం ఇప్పుడు మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

    ANR Fans aggression demands on nandamuri balakrishna akkineni comments

    రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కినేని అభిమానులు భారీ స్థాయిలో ధర్నాలు కూడా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరులోని నర్తకి సెంటర్ దగ్గర బాలకృష్ణ దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. వీలైనంత త్వరగా బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో డిమాండ్ అయితే చేస్తున్నారు.

    ఇక మరోవైపు తెలంగాణలోని హైదరాబాదులో కూడా అక్కినేని అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కూకట్ పల్లి లోని అర్జున థియేటర్ వద్దకు కూడా కొంతమంది అభిమానులు ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు ఈ విషయంపై బాలకృష్ణ టీం నుంచి అయితే ఎలాంటి వివరణ రాలేదు. ఇక వీలైనంత త్వరగా ఆయన ఈ విషయం పై స్పందించి ఏదో ఒక క్లారిటీ ఇస్తే కాంట్రవర్సీ ముగుస్తుంది అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    ANR Fans aggression demands on nandamuri balakrishna akkineni comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X