పోలీస్ స్టేషన్‌లో బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే!
బండ్ల గణేష్ అంటే స్టార్ ప్రోడ్యూసర్‌గా అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్‌ను ఇండస్ట్రీకి అందించిన నిర్మాతగా సుపరిచితులు. అయితే నిర్మాతగా మారడానికి ముందు కమెడియన్‌గా, అలాగే ప్రొడక్షన్ మేనేజర్‌గా తన సినీ జీవితాన్ని ఆరంభించారు. కమెడియన్‌గా గతంలో ప్రేక్షకులకు తనదైన హాస్యాన్ని పండించారు. అయితే తాజాగా ఆయన హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఓవైపు పవన్ కల్యాణ్‌తో సినిమా తీయడానికి సిద్ధమవుతూనే.. మరో పక్క హీరోగా నటించడం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 4వ తేదీన బండ్ల గణేష్ హీరోగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళితే..

బండ్ల గణేష్ హీరోగా..
నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రిషి ఆగస్త్య సమర్పకుడిగా, స్వాతి చంద్ర నిర్మాతగా యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమా పూజా కార్యక్రమం అనంతరం పోలీస్ స్టేషన్ సెట్‌లో బండ్ల గణేష్‌పై సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం బండ్ల గణేష్‌కు సంబంధించిన లుక్‌ను షేర్ చేశారు.

పోలీస్ స్టేషన్ సెట్‌లో
పోలీస్ స్టేషన్‌లో బండ్ల గణేష్ ముఖానికి గాయాలై కనిపించారు. పోలీసుల ముందు కూర్చొని ఆవేదనతో కూడిన ముఖంతో ఉన్నారు. ఈ ఫోటోను స్వయంగా బండ్ల గణేష్ ట్వీట్ చేసి అభిమానులకు శుభవార్తను అందించారు. తెలుగులో నేను ముఖ్య పాత్ర పోషిస్తుండగా, హిందీ వెర్షన్లో అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు. వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ మీ బండ్ల గణేష్ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తెలుగులో బండ్ల గణేష్.. హిందీలో అభిషేక్ బచ్చన్
సినిమా షూటింగు ప్రారంభమైన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఒత్తు సెరుప్పు సైజ్ 7 అనే తమిళ సినిమాకు రీమేక్ చిత్రం ఇది. ఈ సినిమాలో స్వయంగా నటించడమే కాకుండా ఆర్ పార్తీబన్ దర్శకత్వం వహించారు. తెలుగులో పార్తీబన్ పాత్రను బండ్ల గణేష్ చేస్తున్నారు. హిందీలో ఇదే పాత్రను అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బండ్ల గణేష్ మేకోవర్ అయ్యారు. ఆయన లుక్ మాత్రమే కాకుండా నటనతో కూడా అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు.
Recommended Video

చెన్నైలో తమిళ రీమేక్
ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమా తెలుగు రీమేక్ కోసం ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ, సినిమాటోగ్రాఫర్‌గా అరుణ్ దేవినేని, మరుధూరి రాజా డైలాగ్స్, లైనస్ మాద్రి సంగీతం అందిస్తున్నారు. నాయుడు, ఫణి ఫీఆర్వోలుగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా స్వాతి చంద్ర, దర్శకుడిగా వెంకట్ చంద్ర వ్యవహరిస్తున్నారు. ఇక హిందీ రిమేక్ చిత్రానికి సంబంధించిన షూటింగు చెన్నైలో ప్రారంభమైంది. అభిషేక్ బచ్చన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











