Don't Miss!
- News
Viral Video: బెల్ట్ తో కొట్టుకుంటూ బర్త్ డే సెలబ్రెషన్స్.. అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో.. వీడియో వైరల్..
- Lifestyle
మన జాతీయ జెండా ఏర్పడటం వెనుక ఉన్న చారిత్రక కథ మీకు తెలుసా?
- Finance
పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు చెక్ చేశారా..?
- Automobiles
హోండా ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ Honda CB300F
- Sports
Chess Olympiad 2022 ముగింపు వేడుకలకు ధోనీ.. టాప్‌లో హంపీ టీమ్
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
బంగార్రాజు డైరెక్టర్ నెక్స్ట్ సినిమా వాళ్ళతోనే.. హీరో కూడా ఫిక్స్ అయినట్లే..?
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కోవిడ్ సమయంలో అసలు సినిమాలు విడుదల అవుతాయా లేదా అని అనుమానం లో బంగార్రాజు సినిమా ధైర్యంగా బాక్సాఫీసు ముందు పోటీగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన కథకు కొనసాగింపు వచ్చింది. తప్పకుండా సంక్రాంతి బరిలోనే ఈ సినిమా తప్పకుండా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు అనుమానం లేకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక అప్పుడే కళ్యాణ్ కృష్ణ మరో సినిమాపై చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది

ఇదే తరహాలో కొనసాగితే
ఇక బంగార్రాజు అనుకున్నట్లుగానే మొదటిరోజు పది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుని రెండవ రోజు కూడా అదే తరహాలో వసూళ్ళను సాధించింది. ఇక మూడో రోజు నుంచి కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డు దర్శనమిస్తున్నాయి. చూస్తుంటే ఇదే తరహాలో మరో రెండు మూడు రోజులు కొనసాగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేస్తుందని చెప్పవచ్చు. బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య యువ బంగారు రాజు గా కనిపించిన విషయం తెలిసిందే.

అతనితో సినిమా చేయాలని
ఇక
నాగార్జున
ఎప్పటిలానే
ఆత్మ
పాత్రలో
ఎంతగానో
అలరించాడు.
ఈసారి
సరికొత్తగా
సినిమాలో
కృతి
శెట్టి
ప్రత్యేకమైన
నాగలక్ష్మి
అనే
పాత్రలో
స్పెషల్
అట్రాక్షన్
గా
నిలిచింది.
రమ్యకృష్ణ
కూడా
తన
పాత్రతో
ఎంతగానో
ఆకట్టుకుంది.
అయితే
ఈ
సినిమాను
తెరపైకి
తీసుకువచ్చిన
దర్శకుడు
కళ్యాణ్
కృష్ణ
ప్రస్తుతం
సౌత్
ఇండస్ట్రీలో
కూడా
హాట్
టాపిక్
గా
మారుతున్నాడు.
అతనితో
సినిమా
చేయాలని
ప్రముఖ
నిర్మాణ
సంస్థలు
కూడా
ఎంతో
ఆసక్తిగా
ఎదురుచూస్తున్నాయి.
ఇటీవల
కోలీవుడ్
ఇండస్ట్రీకు
చెందిన
స్టూడియోగ్రీన్
కూడా
అతనికి
ఒక
మంచి
ఆఫర్
ఇచ్చినట్లు
తెలుస్తోంది.

జ్ఞానవేల్ రాజా నిర్మాతగా..
ఆ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా ఈ దర్శకుడిని ప్రత్యేకంగా కలుసుకున్నాడు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తమ సంస్థలో కూడా ఓ సినిమా చేసేందుకు ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు కథలపై చర్చలు జరుపుతున్న కళ్యాణ్ కృష్ణ స్టార్ హీరోలతోనే మంచి సినిమాను తెరపైకి తీసుకురావాలని చూస్తున్నాడు. అలాగే మెగా హీరోలతో కూడా అతను టచ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

హీరో ఎవరంటే..?
వీలైనంత వరకు మంచి ఫ్యామిలీ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలి అని కళ్యాణ్ కృష్ణ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ద్విభాషా చిత్రాన్ని చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అతనితో సినిమా చేసేందుకు ఒక తమిళ హీరో కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా సూర్య కార్తీ వంటి హీరోలతో సినిమాలు చేసే స్టూడియోగ్రీన్ కళ్యాణ్ కృష్ణను వారి కోసం కూడా సంప్రదిస్తున్నట్లు ఒక టాక్ కూడా చర్చనీయాంశంగా మారింది. మరి తదుపరి సినిమాతో కళ్యాణ్ కృష్ణ బాక్సాఫీసు వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.