twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖిలాడి డబ్బింగ్ రైట్స్ చేజిక్కించుకున్న బాలీవుడ్ బడా సంస్థ.. ఒక్క డీల్ తో రవితేజ సినిమాకి భారీ లాభాలు!

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొంతమంది హీరోలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో కూడా మార్కెట్ ను ఏమాత్రం తగ్గించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇక గత ఏడాది నుంచి రవితేజ అయితే ఒకే ఒక్క సినిమాతో తన స్థాయిని ఒక్కసారిగా పెంచేసుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసినటువంటి క్రాక్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్టకాలంలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. రవితేజ కెరీర్ లో కూడా అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అసలు సినిమాలు ఎప్పటి తరహాలోనే థియేటర్స్ లో క్9నసాగుతాయా లేదా అని అనుకుంటున్న తరుణంలో క్రాక్ సినిమా అయితే చిత్ర పరిశ్రమలో మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.

    కరోనా పాండమిక్ తరువాత కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుని ఒక సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఆ నమ్మకంతోనే మాస్ మహారాజా రవితేజ తన తదుపరి సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ ఖిలాడి సినిమాపైనే ఉంది. రాక్షసుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడి సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

    Bollywood pen studios huge offer to ravi teja khiladi Movie

    గతంలోనూ రమేష్ వర్మ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వీర సినిమా పర్వాలేదనిపించింది. ఇక మళ్లీ చాలా కాలం తరువాత వీరి కలయికలో వస్తున్న ఖిలాడి సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు మిగతా భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలైతే సినిమా తెరపైకి రాక ముందే బాలీవుడ్లో రీమేక్ హక్కులను సొంతం చేసుకునే విధంగా కొన్ని ఆఫర్స్ అయితే చాలానే వచ్చాయి. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం అప్పుడు తొందరపడలేదు. సల్మాన్ ఖాన్ కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కథనాలు కూడా వెలువడ్డాయి.

    ఇక ఇప్పుడు బాలీవుడ్ బడా సంస్థ పెన్ స్టూడియోస్ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ డిజిటల్ రిలీజ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రూట్లో సినిమాకు దాదాపుగా పదిహేను కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఖిలాడి సినిమాను హిందీలో కూడా డైరెక్ట్ గా నే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాతల మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయని తెలుస్తోంది. పెన్ స్టూడియోస్ అయితే సినిమా డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చారు. మరి సినిమాను హిందీలో విడుదల చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

    English summary
    Bollywood pen studios huge offer to ravi teja khiladi Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X