For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాక్సాఫీస్ బాహుబలి.. సాహోరే ప్రభాస్‌.. డార్లింగ్‌కు హ్యాపీ బర్త్‌డే!

  |
  Twitter Pours Wishes To Prabhas On His Birthday

  బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్నాడు. అమరేంద్ర బాహుబలి అనే యోధుడిగా ఇటు మహేంద్ర బాహుబలి అనే వీరుడిగా రెండు పాత్రల్లో నటించి ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పించారు. తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపించాడు. స్టార్‌గా తన ఇమేజ్‌ను ఊహించని స్థాయికి చేర్చుకొన్నాడు. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకొనే అలాంటి ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23. యంగ్ రెబల్‌స్టార్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ ప్రత్యేక కథనం.

   కృష్ణంరాజు నటవారసుడిగా ప్రవేశం

  కృష్ణంరాజు నటవారసుడిగా ప్రవేశం

  రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడిగా పరిచయమైన ప్రభాస్‌. ఆరడుగులతో 'హీరో అంటే ఇలా ఉండ్రాలా' అనే అభిమానాన్ని సంపాదించుకొన్నారు. ఈశ్వర్‌ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. 'రాఘవేంద్ర', 'వర్షం', 'అడవిరాముడు', 'చక్రం', 'ఛత్రపతి', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా' 'బుజ్జిగాడు' 'బిల్లా', 'ఏక్‌నిరంజన్‌', 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'రెబల్‌', 'మిర్చి' వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు,

  బాహుబలితో ప్రభంజనం

  బాహుబలితో ప్రభంజనం

  2015లో 'బాహుబలి ది బిగినింగ్‌', 2017లో విడుదలైన 'బాహుబలి 2'తో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్‌. అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంగా వేస్తున్న ప్రతి అడుగులో తను చూపే కృషి, పట్టుదల, దీక్ష.. ప్రభాస్‌ని కోట్లాది మందికి చేరువ చేశాయి.

  బాక్సాఫీస్‌ బాహుబలిగా

  బాక్సాఫీస్‌ బాహుబలిగా

  విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన బాహుబలిని ఐదేళ్ల వరకు ఓ మహాయజ్ఞంలా పూర్తి చేయడానికి ప్రభాస్‌ పడ్డ కష్టమేంటో సినిమా రిలీజైన తర్వాతే అందరికీ తెలిసింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించ కుండా ఓ కమిట్‌మెంట్‌తో సినిమా చెయ్యాలంటే ఏ హీరో అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ప్రభాస్‌ మాత్రం అలా ఆలోచించలేదంటే తనపై తనకు ఉన్న నమ్మకాన్ని చూపించారు.

  ఐదేళ్ల శ్రమకు ఫలితం

  ఐదేళ్ల శ్రమకు ఫలితం

  ఐదేళ్లు బాహుబలి గురించే తపన పడ్డారు. మరో సినిమా చేయడానికి కూడా ఇష్టపడలేదు. ప్రభాస్‌ తపన, రాజమౌళి కృషి కలయికే 'బాహుబలి'. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్‌ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. అభిమానులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో కలెక్షన్స్‌ రూపంలో బదులిచ్చారు.

  బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసి

  బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసి

  తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డుల రూపంలో 'బాహుబలి' రెండు భాగాలు కలిపి దాదాపు రూ. 2.5 వేల కోట్ల వసూళ్లను రాబట్టిందంటే ఆ సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలి కలెక్షన్స్‌ కుంభవృష్టిని కురిపించింది. యావత్‌ ప్రపంచ సినీ పరిశ్రమ తల తిప్పి చూసేలా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

  బాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్స్

  బాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్స్

  బాహుబలి తర్వాత బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్‌ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్‌ ప్రకటించడం అతడి ఫాలోయింగ్‌కు అద్దం పట్టింది. బాహుబలితో ఇతర భాషల్లో కూడా ప్రభాస్‌కు ఆదరణ పెరగడంతో గతంలో ప్రభాస్‌ నటించిన సినిమాలు సోషల్‌ మీడియాలో, డబ్బింగ్‌ వెర్షన్స్‌లో సూపర్‌హిట్‌ చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్‌ చూసిన చిత్రాలుగా నిలిచాయి.

  అంతర్జాతీయ గుర్తింపు.. గౌరవం

  అంతర్జాతీయ గుర్తింపు.. గౌరవం

  ప్రధాని నరేంద్ర మోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్‌ నిలిచారు. బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. దీంతో ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

   భారీ అంచనాలతో సాహో'గా

  భారీ అంచనాలతో సాహో'గా

  బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ సుజిత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 200 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహో' చిత్రాన్ని హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ప్రభాస్‌ లుక్స్‌ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మందిరా బేడి, ఎవ్‌లిన్‌ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ వంటి బాలీవుడ్‌ తారలు నటిస్తుండటం విశేషం.

   ప్రభాస్ మరో భారీ చిత్రం

  ప్రభాస్ మరో భారీ చిత్రం

  'సాహో' సెట్స్‌లో ఉండగానే ప్రభాస్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే మరో భారీ బడ్జెట్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొని ఆశ్చర్యానికి గురి చేశారు. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శక త్వంలో ఇటలీలో షూటింగ్‌ ప్రారంభమైంది. యూరప్‌లో అత్యధిక భాగం షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. ఈ చిత్రానికి కూడా హాలీవుడ్‌ టెక్నీషి యన్స్‌ పనిచేస్తున్నారు.

  హ్యాపీ బర్త్ డే టూ ప్రభాస్

  హ్యాపీ బర్త్ డే టూ ప్రభాస్

  యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్‌ ఆడియెన్స్‌లో కూడా ప్రభాస్‌ ఇమేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా 'డార్లింగ్‌' అంటూ పలకరించే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు తెలుగు ఫిల్మీబీట్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నది.

  English summary
  The makers of his upcoming film Saaho have released a brand new poster on the occasion of his birthday today and boy, we just can't wait for the action thriller to hit the theatrical screens.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X