twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రక్తం అమ్ముకొన్నాను అంటూ విషం చిమ్మారు.. వారికి అలా బుద్ది చెప్పా.. దత్తాత్రేయ అలయ్ బలయ్‌లో చిరంజీవి ఎమోషనల్

    |

    గాడ్‌ఫాదర్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దసరా ఉత్సవాల్లో భాగంగా మాజీ కేంద్ర మంత్రి, గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ భలయ్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..

    పవన్ కల్యాణ్, అరవింద్‌కు పిలుపు

    పవన్ కల్యాణ్, అరవింద్‌కు పిలుపు

    గౌరవనీయులు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి కొద్ది సంవత్సరాల నుంచి రావాలని కోరుకొంటున్నాను. కానీ నా తమ్ముడు పవన్ కల్యాణ్, మా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్‌కు ఆహ్వానం లభించింది. కానీ నాకు దత్తాత్రేయ గారు ఆహ్వానం పంపలేదు. ఆయన దృష్టి పడిన తర్వాత నేను వద్దామని అనుకొన్నాను. నా కెరీర్‌లో సూపర్‌హిట్ కొట్టిన రోజే దత్తాత్రేయ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికడం చాలా ఆనందంగా ఉంది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను అని చిరంజీవి అన్నారు.

    తెలంగాణ సంస్కృతిలో అలయ్ బలయ్

    తెలంగాణ సంస్కృతిలో అలయ్ బలయ్

    అలయ్ బలయ్ సంప్రదాయం తెలంగాణ సంస్కృతిలో భాగం. అలాంటి సంప్రదాయపరమైన వేడుకకు దేశవ్యాప్తంగా దత్తాత్రేయ గారు ప్రాచుర్యం కల్పించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఉన్నతమైన అలయ్ బలయ్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం జరుగాలి. స్నేహానికి, ప్రేమకు చిహ్నమైన అలయ్ బలయ్‌ సంప్రదాయం తెలంగాణలో ఉండటం అభినందనీయం అని చిరంజీవి చెప్పారు.

    ఒక హీరో పోస్టర్‌పై మరో హీరో ఫ్యాన్స్

    ఒక హీరో పోస్టర్‌పై మరో హీరో ఫ్యాన్స్

    సినిమా పరిశ్రమలో సీనీ హీరోల అభిమానుల మధ్య విద్వేషాలు రగులుతుండేవి. ఒకరి హీరో ఫ్యాన్స్, మరో హీరో ఫ్యాన్స్‌పై మాటల దాడి చేసుకొనేవారు. పోస్టర్లపై పేడ కొట్టుకొనే వారు. కానీ అలాంటి సంస్కృతికి ముగింపు పలికి ప్రేమ, సహృద్బావం ఉండాలనే కోరిక నాలో ఉండేది. సినీ తారల మధ్య విభేదాలు ఉండకూడదనే కారణంతో నా సినిమాలు సక్సెస్ అయినప్పుడు విందు ఏర్పాటు చేసి ఇండస్ట్రీలోని హీరోలందరిని పిలిచే వాడిని. అలా మా మధ్య ఎలాంటి ఇగోలు లేకుండా ప్రయత్నించేవాడిని అని చిరంజీవి చెప్పారు.

    శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో కౌగిలింత గురించి

    శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో కౌగిలింత గురించి

    శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో కౌగిలింత పవర్ ఏమిటో చెప్పాం. కౌగిలింత ఇద్దరు మధ్య విద్వేషాన్ని తొలగిస్తుంది. నేను అసెంబ్లీలో ఉండగా.. అధికార, ప్రతిపక్ష సభ్యులు మధ్య కొట్టుకొని, తిట్టుకొనే విధంగా వాగ్వాదాలు జరిగేవి. కానీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకొని ప్రేమను వ్యక్తీకరించుకొనే వారు. మనిషిలో ఎంత విద్వేషం ఉన్నా.. ఒక్క కౌగిలింత.. ఒక గుండెను మరో గుండెను దగ్గరికి చేరుస్తుంది. మనమంత మానవులం. ఎంతకాలం ఈ విద్వేషం ఎందుకు అని మన హృదయం చెబుతుంది. అందుకే తెలంగాణ సంస్కృతి ఉన్న ప్రతీచోట అలయ్ బలయ్ కార్యక్రమాన్ని జరపాలి అని చిరంజీవి ఎమోషనల్‌ అయ్యారు.

    మన ఇంటి నుంచే మొదలుపెట్టాలి

    మన ఇంటి నుంచే మొదలుపెట్టాలి


    ప్రేమ, అనురాగాల పంచే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని జరుపుకోవడం మన కుటుంబం నుంచే ప్రారంభించాలి. మానవ సంబంధాలు బలపడుతాయి. ఇంటిలో భార్య గానీ.. ఇతర కుటుంబ సభ్యుడు చేసే పనికి ప్రశంసిస్తూ.. వారిని దగ్గరగా తీసుకొని ఓ మంచి మాట చెప్పండి. ప్రేమ కౌగిలించుకొని వారి సేవలను గుర్తించండి.. అప్పుడు ఇద్దరి మధ్య బలపడే ప్రేమ అంతా ఇంతా కాదు అని చిరంజీవి అన్నారు.

    రక్తం అమ్ముకొని జీవిస్తున్నానని..

    రక్తం అమ్ముకొని జీవిస్తున్నానని..


    నేను రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు గానీ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గానీ రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ నాపై మాటల దాడి చేశారు. బ్లడ్ అమ్ముకొంటున్నాడు. రక్తం అమ్ముకొంటున్నాడు అని ఆరోపణలు చేశాడు. అయితే అలాంటి ఆరోపణలకు నేను ఏనాడు స్పందిచంలేదు. వాస్తవాలు ఆలస్యంగా తెలుసుకొంటారు. సత్యాన్ని ఏనాటికైనా గ్రహిస్తారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని ఎదురు చూసేవాడిని. ఎదుటి వాడు ఎంత విషం చిమ్మినా గానీ.. ప్రేమను పంచేవాడిని. మాటకు లొంగని వాడు.. హృదయస్పందనకు స్పందనకు లొంగిపోతాడు. కాబట్టి దత్తన్న నిర్వహించే ఆలయ్ బలయ్ కార్యక్రమ సారాన్ని ఆచరించండి.. నేను ఎప్పుటి నుంచో ఆచరిస్తున్నాను అంటూ చిరంజీవి భావోద్వేగంతో ప్రసంగాన్ని ముగించారు.

    English summary
    Megastar Chiranjeevi emotional speech at Bandaru Dattatreya alai balai after GodFather success. He given a call to spread love among the human beings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X