twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను తొక్కేసేందుకు కోట్లు కుమ్మరించారు.. రజనీ, కమల్‌కు చిరంజీవి హెచ్చరిక

    |

    Recommended Video

    Chiranjeevi About His Political Life || రజనీ, కమల్‌కు చిరంజీవి హెచ్చరిక

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా‌కు సంబంధించి ప్రమోషన్‌లో బిజీగా మారిపోయారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత కథతో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా తమిళంలో ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రారంభించిన రాజకీయ పార్టీలపై ఏమని కామెంట్ చేశారంటే..

    సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు

    సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు

    చెన్నైలో తమిళ మీడియా అడిగిన ఓ ప్రశ్నపై చిరంజీవి స్పందిస్తూ.. రాజకీయాలు వేరు.. సినిమా జీవితం వేరు. రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలు ప్రారంభించడం మంచిదే. కానీ వాస్తవాలను గ్రహించి ముందుకెళ్లాలి. నా అభిప్రాయమైతే.. రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళ్లకపోతే బాగుంటుంది. సినీ తారలకు విలువలు లేని రాజకీయాలు తగవు. రాజకీయాలంటే ధనం చుట్టే తిరుగుతాయి అని చిరంజీవి అన్నారు.

    నంబర్ వన్ స్థానంలో వదులుకొని

    నంబర్ వన్ స్థానంలో వదులుకొని

    సైరా ప్రమోషన్‌లో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నేను పాలిటిక్స్‌లోకి ప్రవేశించినపుడు ఇండస్ట్రీలో నేను నంబర్ 1. అలాంటి పొజిషన్‌ను వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లాను. కానీ నేను పోటీ చేసిన నియోజకవర్గంలోనే దారుణంగా ఓడిపోయాను. నన్న ఓడించడానికి కోట్లు ఖర్చు చేశారు. పవన్ కల్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది అని చిరంజీవి పేర్కొన్నారు.

    కమల్ ఓటమి బాధించింది..

    కమల్ ఓటమి బాధించింది..

    తమిళ రాజకీయాలపై స్పందిస్తూ గత ఎలక్షన్‌లో కమల్ హాసన్ విజయం సాధిస్తారని అనుకొన్నాను. కానీ అది జరగకపోవడం షాక్ కలిగించింది. సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తులకు రాజకీయాలు సూట్ కావు. రజనీ, కమల్ నాలాగా సున్నితమైన మనస్కులు కాకపోయినప్పటికీ. .వారిని రాజకీయాలకు దూరంగా ఉండాలన్నదే నా అభిప్రాయం అని చిరంజీవి అన్నారు.

    ప్రజాసేవ కోసం సహనం పాటిస్తే

    ప్రజాసేవ కోసం సహనం పాటిస్తే

    ఇక ప్రజాసేవ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఓటమి, ఎదురు దెబ్బలను సహించే శక్తి ఉంటే ప్రజాసేవ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి మనోధైర్యం ఉటే రాజకీయాల్లోకి వెళ్లవచ్చు. రాజకీయాల్లో రాణించాలంటే చాలా సహనం ఉండాలి. ఆ సహనమే ఏదో రోజు మంచి ఫలితాలను అందిస్తాయి అని చిరంజీవి తెలిపారు.

     రాజకీయ ప్రవేశం కోసం రజనీ రెడీ

    రాజకీయ ప్రవేశం కోసం రజనీ రెడీ

    తమిళనాడులో కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. రజనీకాంత్ పార్టీని పెట్టడానికి సిద్ధమవుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు మక్కల్ నీది మైయాం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్ 37 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేశారు. కానీ ఏ ఒక్క సీటులో కూడా విజయం సాధించలేదు.

    English summary
    Chiranjeevi sensational comments on Rajinikanth and Kamal Haasan sye raa promotion. He said Politics are not suitable for both and They are not sensitive like me, but politics are all about money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X