For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi: చిరంజీవి చేతికి కట్టు.. ఏమైంది అనే టెన్షన్లో ఫాన్స్!

  |

  క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్ర‌తినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజున తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజ‌న్ సేవ‌ల్లో పాల్గొన్న ప్ర‌తినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చేతికి గాయం కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

  చిరంజీవి బ్లడ్ బ్యాంకులో

  చిరంజీవి బ్లడ్ బ్యాంకులో

  హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ''క‌రోనా క‌ష్ట‌కాలంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేద‌న చెందానని అన్నారు. క‌రోనా భారిన ప‌డి దుర‌దృష్ట వ‌శాత్తు ప్ర‌సాద్, నాగ‌బాబు, ర‌విలను కోల్పోయానని అన్నారు. క‌రోనా పొట్ట‌న పెట్టుకుని విషాదాన్ని మిగిల్చిందన్న ఆయన వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలని అన్నారు. క‌రోనా కాలంలో తాను అండ‌గా నిలుస్తాన‌ని నా స్నేహితుడు శేఖ‌ర్ ముందుకొచ్చారని, త‌న విరామ స‌మ‌యాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు అంకిత‌మిస్తాన‌ని అన్నారని అందుకే ఆయనని చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గా నియ‌మించామని అన్నారు.

  వెన్నుద‌న్నుగా

  వెన్నుద‌న్నుగా


  ఇక చెన్నైలో త‌న కెరీర్ సాగుతున్న‌ప్ప‌టి నుంచి శేఖ‌ర్ త‌న‌కు స్నేహితుడని ఒక అభిమానిగా వెన్నుద‌న్నుగా నిలిచాడ‌ని చిరంజీవి వెల్లడించారు. క‌రోనా బారిన ప‌డిన క్ష‌ణం నుంచి వారికి వారి కుటుంబానికి ఏ విధంగా ధైర్యం ఇవ్వ‌గ‌ల‌ను అని ప్ర‌య‌త్నించానన్నా చిరంజీవి ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి మంచి వైద్యం అందించే ప్ర‌య‌త్నం చేశానని అన్నారు. మెగా అభిమానులైన ముగ్గురు నలుగురిని కాపాడ‌లేక‌పోవ‌డం దుర‌దృష్టమని అన్నారు. వారి కుటుంబానికి మాన‌సిక స్థైర్యం క‌లిగించాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.

  సైనికులుగా ఉన్నందుకు

  సైనికులుగా ఉన్నందుకు

  మీరంతా పెద్ద మ‌నసుతో న‌న్ను అర్థం చేసుకుని సేవాకార్య‌క్ర‌మాల్లో భాగ‌మైనందుకు కార్యాచ‌ర‌ణ‌లో పెట్టిన సైనికులుగా ఉన్నందుకు అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి అన్నారు. ప్ర‌తిక్ష‌ణం అభిమానుల పట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉన్నాన‌ని ఆయన అన్నారు. ఒక ఊరులో చాలా ఎక్కువ మంది చ‌నిపోయారు అని తెలిసి ఏం చేయాలి? అని క‌ల‌త చెందానన్న ఆయన అప్పుడు ఆక్సిజ‌న్ బ్యాంకు పెడ‌దామని ఆలోచన పుట్టిందని అన్నారు. అయితే క‌రోనా ప‌రిస్థితిలో అభిమానులు ముందుకొస్తారా? అనుకుంటే నా పిలుపు విని మీరంతా అండ‌గా నిల‌వ‌డం ఎన‌లేని ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చిందని అనుకున్న‌దే త‌డ‌వుగా వారంలోనే ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించానంటే ఆ క్రెడిబిలిటీ అభిమానుల‌దేన‌ని అన్నారు.

  చాలా ఛాలెంజ్ లు

  చాలా ఛాలెంజ్ లు

  అనుకున్న సిలిండ‌ర్లు దొర‌క్క చాలా ఛాలెంజ్ లు ఎదుర‌య్యాయి కానీ దుబాయ్, గుజ‌రాత్, వైజాగ్ లాంటి చోట్ల ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాల్లో ఆక్సిజ‌న్ ని త‌యారు చేయించామని, అలా 3000 పైగా సిలిండ‌ర్లు త‌యారు చేయించాం... కానీ ఆక్సిజ‌న్ కొర‌త‌ను ఎదుర్కొన్నాం. చాలా శ్ర‌మించాం.. అని తెలిపారు. అభిమానులు ఒక సైనికుడిలా సేవాకార్య‌క్ర‌మాల్లో ప‌ని చేశారని అన్నారు. క‌రోనాలో వేల ప్రాణాలు కాపాడామన్న ఆయన ఒక శాతం కాదు నూటికి నూరు శాతం మీరు సేవ‌లు చేశారని అన్నారు.

  Actress Sree Leela Exclusive Interview Part 2 | Pelli SandaD
  చిరంజీవికి చేతి కట్టు

  చిరంజీవికి చేతి కట్టు

  అయితే మెగాస్టార్ చిరంజీవికి చేతి కట్టు ఉండటంతో మెగా అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చేతికి ఏమైంది ఏంటి అనే వివరాలు మాత్రం ఏమి వెల్లడి కాలేదు. ఆయన గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లో ఏమైనా గాయాలయ్యాయా? అనే అంశం మీద చర్చ జరుగుతోంది. దీని మీద మెగాస్టార్ స్వయంగా క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం ఏమిటి అనేది వెల్లడి కాదనే చెప్పాలి.

  English summary
  Chiranjeevi Spotted With Hand Bandage in chiranjeevi blood bank.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X