Don't Miss!
- News
బీజేపీ నేత ఇంటిపైకి బుల్డోజర్ పంపిన యోగి ఆదిత్యనాథ్: మహిళపై దాడే కారణం
- Sports
India Squad For Asia Cup: ఇదేం సెలెక్షన్ నాయనా.. జట్టు ఎంపికలో బ్లండర్ మిస్టేక్స్..!
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Lifestyle
మీ వంటగదిలో ఉండే ఈ 8 వస్తువులు మీ జుట్టును పొడవుగా మరియు మెరిసేలా చేయగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
- Finance
Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
- Automobiles
19 రోజుల్లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ప్రయాణం: బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మంగళూరు వ్యక్తి అరుదైన రికార్డ్
YS జగన్ బయోపిక్ చేస్తాను..కానీ.. దుల్కర్ సల్మాన్ కామెంట్!
మలయాళం స్టార్ హీరో మమ్ముంటీ తనయుడు దుల్కర్ సల్మాన్ చాలా తొందరగానే సినిమా హీరోగా సెట్ అయిపోయాడు. దేశంలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకరైన దుల్కర్ సల్మాన్ తెలుగు వారికి కూడా మహానటి సినిమాతో చాలా ఫేవరెట్ గా మారిపోయాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల అతను సీతారామం సినిమా ప్రమోషన్ లో భాగంగా పలుచోట్ల ప్రమోషన్స్ చేసినప్పుడు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా వైజాగ్ లో దుల్కర్ సల్మాన్ కొన్ని షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఒక రేంజ్ లో వచ్చారు. ఆ రెస్పాన్స్ చూసిన దుల్కర్ సల్మాన్ ఆశ్చర్యపోయాడు. నిజంగా ఆ స్థాయిలో జనాల నుంచి తనకు మద్దతు లభిస్తుంది అని ఊహించలేదు అని అన్నాడు. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ లో నటిస్తారా లేదా అనే ప్రశ్నకు కూడా ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఇదివరకే దుల్కర్ తండ్రి మమ్ముంటీ, వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఆ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ జగన్ బయోపిక్ రాబోతున్నట్లు అప్పట్లో చాలా రకాల కథనాలు వచ్చాయి. అయితే దుల్కర్ సల్మాన్ కూడా అందులో అవకాశం వస్తే నటిస్తానని కాకపోతే స్క్రిప్ట్ కూడా నచ్చే విధంగా ఉండాలి అని అన్నాడు.
అలాగే తానకి ఇక్కడి రాజకీయ పరిస్థితులు కూడా తెలియవు కాబట్టి ఆ విషయంలో కాస్త పూర్తిగా ఆలోచించుకొని కూడా సినిమా చేయడానికి ఒప్పుకుంటాను అని వివరణ ఇవ్వడంతో అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. ఇక వైయస్ జగన్ అభిమానులు కూడా దుల్కర్ సల్మాన్ బయోపిక్ లో నటిస్తే చూడాలని ఉంది అని కోరుకుంటున్నారు. మరి యాత్ర మేకర్స్ ఆ సినిమాకు కొనసాగింపుగా వైఎస్ జగన్ బయోపిక్ ను కూడా కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి.