For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగార్జునకు షాకిచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్: పాపం పొరపాటున సర్‌ప్రైజ్‌ లీక్ చేసేశాడుగా!

  |

  దాదాపు నాలుగైదేళ్లుగా హిట్ లేక తెగ ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీ తర్వాత సక్సెస్‌నే అందుకోలేకపోయిన ఆయన.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, సక్సెస్ ట్రాక్ మాత్రం ఎక్కడం లేదు. దీంతో ఈ స్టార్ హీరో అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో నాగ్ 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది పాజిటివ్‌గా టాక్‌ను అందుకున్నా.. కమర్షియల్‌గా సక్సెస్‌ అవలేదు. దీంతో విజయం కోసం ఆయన నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

  కొద్ది రోజుల క్రితం అక్కినేని నాగార్జున విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాను ప్రారంభించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా పున: ప్రారంభం అయినా.. ఇది మాత్రం పట్టాలెక్కలేదు. దీంతో ప్రవీణ్ సత్తారు.. నాగార్జున సినిమా ఆగిపోయిందని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, వాళ్లిద్దరి మధ్య స్క్రిప్ట్, క్రియేటివిటీ విషయాల్లో విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇది మళ్లీ మొదలవదన్న టాక్ కూడా వినిపించింది.

  Ghost: Praveen Sattaru Leak Akkineni Nagarjuna Movie Title

  అక్కినేని నాగార్జున.. ప్రవీణ్ సత్తారు మూవీ మధ్యలోనే ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోన్న వేళ.. కొద్ది రోజుల క్రితం ఇది పున: ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఆ పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లైంది. ఇక, అప్పటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లో ఈ మూవీ కోసం ప్రత్యేకమైన సెట్స్ కూడా ఏర్పాటు చేశారు. అందులోనే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

  Sarkaru Vaari Paata Birthday Blaster: మహేశ్ బాబు అరుదైన రికార్డ్.. ఇందులో మూడు అందులో ఐదో స్థానం

  నిర్మాత సునీల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు ఉదయం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌లో అక్కినేని నాగార్జున ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో కత్తి పట్టుకుని నడుచుకుంటూ వస్తోన్నట్లు చూపించారు. అదే సమయంలో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ రాబోతుందని వెల్లడించారు. ఇక, దీని గురించి ట్వీట్ చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. 'KingNagarjunaGhost' అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా టైటిల్ 'ఘోస్ట్' అన్న విషయం లీకైపోయింది. సినిమా పేరును లీక్ చేసిన విషయాన్ని గ్రహించాడో ఏమో ప్రవీణ్ సత్తారు.. తన ట్వీట్‌ను మార్చేసి ఆ ట్యాగులను తొలగించాడు.

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఊహించని పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

  English summary
  Akkineni Nagarjuna Now Doing An Action Film Under Praveen Sattaru Direction. Recently This Movie Pre Look Poster Released. Director Leak This Movie Title.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X