Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ginna First Look: క్యారెక్టర్ లో మునిగిపోయిన మంచు విష్ణు.. మాస్ ఎంట్రీ లుక్ వైరల్!
మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చాలా కాలం అయింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలి అని ఒక డిఫరెంట్ కామెడీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. విష్ణు సొంత ప్రొడక్షన్ AVA ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ సినిమాను భారీ స్థాయిలోనే తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా జిన్నా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చి రాగానే మంచి విష్ణు అదిరిపోయేలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసాడు. ఫస్ట్ లుక్ విషయానికి వస్తే దర్శకుడు సినిమాటోగ్రఫీ ఎవరు పిలిచినా కూడా కూర్చున్న చోట నుంచి కదలని మంచు విష్ణు జిన్నా అని పిలవగానే షూటింగ్ స్పాట్లో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. షూటింగ్ స్పాట్ లోనే చాలా సరదాగా ఈ సన్నివేశాన్ని చూపించడం ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మంచు విష్ణు ఈ సినిమాను చాలా డిఫరెంట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.
పాయల్ రాజ్ పూత్ మేయిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సన్నీలియోన్ కూడా మరొక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇదివరకే మంచు విష్ణు సన్నిలియోన్ తో సరదాగా చేసిన కామెడీ స్కిట్స్ కొన్నిసోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అయితే తుది దశకు చేరుకున్నాయి. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.

ఇక వీలైనంత త్వరగా మ్యూజిక్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. జిన్నా సినిమాలో వెన్నెల కిషోర్ సునీల్ కూడా కొన్ని ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించగా సూర్య దర్శకత్వం వహించాడు. ఇక పూర్తి స్క్రిప్టును జీ నాగేశ్వర్ రెడ్డి సమకూర్చగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మరి జిన్నా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.