Don't Miss!
- Sports
INDvsNZ : ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. దీపక్ హుడాకు దిగ్గజం మద్దతు!
- News
ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మొదటిసారి కండలు చూపిస్తూ షాక్ ఇచ్చిన అల్లు శిరీష్.. ఫిట్‌నెస్‌తోనే చంపేశాడుగా
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సినీ వారసుల్లో అల్లు శిరీష్ ఒకరు. మెగా నిర్మాత అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ బాగానే కష్టపడుతున్నాడు గాని బాక్సాఫీస్ వద్ద ఇంకా మొదటి సక్సెస్ చూడలేదు. ఇక లాభం లేదనుకొని మనోడు ఫిట్నెస్ లో భారీ మార్పులు తెచ్చేశాడు. నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త స్టైల్ తో షాక్ ఇస్తున్నాడు.

అల్లు వారసులు ఇలా..
అల్లు అరవింద్ ముగ్గురు కొడుకులలో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఇక పెద్దవాడైన అల్లు వెంకటేష్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నాడు. చిన్నవాడు అల్లు శిరీష్ కూడా హీరోగా సక్సెస్ అవ్వాలని గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. మంచి కథలే సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ అతనికి అదృష్టం కలిసి రావట్లేదు.

ఆ ఒక్క సినిమాతోనే..
ఆ మధ్య పరశురామ్ దర్శకత్వంలో చేసిన శ్రీరస్తూ శుభమస్తు సినిమాతో కాస్త పరావలేదు అనిపించాడు. ఇక ఒక్క క్షణం అనే సినిమాతో కూడా విడుదలకు ముందు టీజర్ ట్రైలర్స్ తో కాస్త హడావుడి చేసినప్పటికీ ఆ సినిమా సైతం పెద్దగా సక్సెస్ అవ్వలేదు. వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తున్న కూడా కలిసిరావడం లేదు.

సిక్స్ ప్యాక్ తో..
ఇక చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాతో వచ్చిన శిరీష్ గత ఏడాది ఖాళీగానే ఉన్నాడు. కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఫిట్నెస్ విషయంలో కూడా అల్లు వారబ్బాయి సరికొత్తగా మార్పు తెచ్చాడు. మొదటిసారి సిక్స్ ప్యాక్ తో కండలు చూపిస్తూ షాక్ ఇచ్చాడు.
Recommended Video

కసిగా కష్టపడి..
లాక్ డౌన్ లో సమయం వృధా చేయకుండా ఒక గోల్ సెట్ చేసుకున్న శిరీష్ మొత్తానికి తన అనుకున్న టార్గెట్ ను అందుకున్నాడు. చూస్తుంటే హీరోగా సక్సెస్ అవ్వాలని చాలా కసిగా ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. ప్రస్తుతం రెండు కథలైతే రెడీగా ఉన్నాయట. లాక్ డౌన్ అనంతరం వాటిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.