For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తండ్రి మరణంతో ఆగిపోయిన సంస్థ.. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్న గోపిచంద్

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గోపీచంద్ తొట్టెంపూడి త్వరలోనే సిటీ మార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని గోపీచంద్ అయితే ఒక ప్లాన్ సెట్ చేసుకున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా రెగ్యులర్ ప్రమోషన్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది కూడా రెగ్యులర్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఎంత ఆసక్తికరంగా చెబుతున్నారు.

  మెగాస్టార్ సపోర్ట్

  మెగాస్టార్ సపోర్ట్


  మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా ట్రైలర్ ను చూసి చిత్ర యూనిట్ కి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందించారు. సినిమా ట్రైలర్ చాలా బాగుందని సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా
  ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. హీరో గోపీచంద్ కు ఈ సినిమా రిజల్ట్ చాలా అవసరం అనే చెప్పాలి. ఎందుకంటే అతనికి సక్సెస్ లేక చాలా కాలం అయ్యింది. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. అందుకే సిటిమార్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

  తండ్రి మరణం తరువాత

  తండ్రి మరణం తరువాత

  అయితే గోపీచంద్ నిర్మాతగా కూడా మారేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తప్పకుండా నిర్మాతగా అడుగులు వేస్తానని అయితే దానికి ఇంకా సమయం కూడా ఉందని అన్నాడు. గోపిచంద్ తండ్రి టి కృష్ణ గారు ఈతరం ఫిలిమ్స్ లో అప్పట్లో సామాజిక అంశాల నేపథ్యంలో అనేక సినిమాలను డైరెక్ట్ చేసి నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం తరువాత మళ్ళీ సినిమాలని ఎవరు నిర్మించలేదు.

   నిర్మాతగా గోపిచంద్

  నిర్మాతగా గోపిచంద్

  ఇక తన తండ్రి మొదలు పెట్టిన ఈ బ్యానర్ ను మళ్లీ కొనసాగించేందుకు గోపీచంద్ కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కేవలం కథ ఒక్కటే మంచిగా ఉంటే సరిపోదు అంటూ దానికి ప్రత్యేకమైన ప్లాన్ కూడా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. తాను ఒక సినిమాను నిర్మించాలి అంటే ముందుగానే పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలని చెప్పుకొచ్చాడు. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే తెరపైకి వచ్చే ముందే దర్శకుడు ప్రతి ఒక్క సన్నివేశాన్ని క్లియర్ గా రాసుకోవాలని ముందుగానే లొకేషన్స్ లో కూడా ఒకసారి చూసుకొని ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ కూడా పర్ఫెక్ట్ గా రెడీ చేసుకోవాలి అని చెప్పాడు.

   చిన్న చిన్న పొరపాట్ల వల్ల

  చిన్న చిన్న పొరపాట్ల వల్ల


  అప్పుడే సినిమా కూడా నమ్మకంతో హిట్ అవుతుందని చెబుతూ సరైన ప్లాన్ తో వెళితే ఏ సినిమా ప్లాప్ అవ్వదని కూడా తెలియజేశారు. ఇక చాలా వరకూ చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలను కూడా అందుకోలేవని, తొందరపాటు నిర్ణయం వల్ల లేక వేరే కారణం చేత నిర్ణయాన్ని మార్చుకోవడం వలన కూడా సినిమాల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందిని అన్నారు.

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  ప్రభాస్ రానట్లే?

  ప్రభాస్ రానట్లే?

  ఇక తన సినిమాల విషయంలో కూడా చాలాసార్లు అదే జరిగిందని ఇక నుంచి అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను అని కూడా అన్నాడు. ఇక సీరిమార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారు. అయితే ఈ వేడుకకు ప్రభాస్ వస్తాడని మొన్నటివరకు ఒక టాక్ అయితే వచ్చింది కానీ ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన రాకపోవచ్చని తెలుస్తోంది.

  English summary
  Hero gopichand planing on her father production banner restart,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X