అఖిల్ అమ్మాయి అనుకోని అలాంటి బట్టలు కొనేసిన నాగార్జున.. బయటకు రాగానే షాక్

అక్కినేని నాగేశ్వరరావు వారసత్వం నుంచి వచ్చిన నాగార్జున కూడా తండ్రిలానే ప్రయోగాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక వారికి అమ్మాయిల ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నాగచైతన్య కూడా కంటిన్యూ అవుతుండగా అఖిల్ ఇంకా సరైన ట్రాక్ లోకి రాలేదు. అయితే అఖిల్ విషయంలో అనుకోకుండా ఒక పొరపాటు జరగడం వలన నాగార్జున అమ్మాయి అనుకున్నాడట. అమ్మాయిలకు వేసే బట్టలు కూడా కొన్నాడట. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు.

 మొదటి భార్య..

మొదటి భార్య..

నాగార్జున వారసులుగా అడుగు పెట్టిన అక్కినేని నాగ చైతన్య మొదటి భార్య కొడుకని అందరికి తెలిసిన విషయమే. మొదట హీరో వెంకటేష్ సోదరి లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్న నాగార్జున నాగచైతన్య పుట్టిన అనంతరం విడాకులు తీసుకున్నాడు. అనంతరం మరి కొన్నాళ్లకు శివ సినిమాతో పరిచయమైన అమలను వివాహం చేసుకున్నారు.

అఖిల్, నాగచైతన్య రిలేషన్

అఖిల్, నాగచైతన్య రిలేషన్

అమలను పెళ్లి చేసుకున్న తరువాత అఖిల్ జన్మించిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు కూడా నాగచైతన్యను ఇంట్లోనే ఉంచుకొని పెద్ద వారసుడిగానే చూసుకున్నారు. అమల సైతం ఇద్దరు నా కొడుకులే అనే బావనతోనే చూసింది. ఆ విషయాన్ని నాగార్జున చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అఖిల్ కూడా నాగచైతన్యతో చాలా ఫ్రీగా ఉంటారని కూడా అన్నారు.

అమలను అమెరికాకు పంపిన నాగార్జున

అమలను అమెరికాకు పంపిన నాగార్జున

అయితే నాగార్జునకు అమ్మాయి కావాలని చాలా కోరికగా ఉండేదట. అమలకు ఆడపిల్ల పుడుతుందని ఎంతో నమ్మకంతో ఉండేదని అన్నారు. ఇక అప్పట్లో ఆరు నెలల కడుపుతో ఉన్నప్పుడు స్కానింగ్ ద్వారా తెలుసుకోవాలని అనుకోగా అమెరికాకు పంపాల్సి వచ్చింది. ఇండియాలో అలాంటి రూల్స్ ఉండవు కాబట్టి అమెరికాకు పంపితే అక్కడ తెలుసుకోవడమే కాకుండా అమల కూడా కొంచెం బయట ప్రపంచంలో హ్యాపీగా వాకింగ్ కూడా చేసుకోవచ్చని అక్కడికి షిఫ్ట్ చేసినట్లు నాగ్ తెలిపారు.

 అమ్మాయి అనుకోని..

అమ్మాయి అనుకోని..

కొన్నాళ్ళు నాగార్జున కూడా అమలతోనే ఉన్నారు. ఇక స్కానింగ్ అనంతరం ఆడపిల్ల పుడుతుందని అనగానే నాగార్జున ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయినట్లు చెప్పారు. ముందుగానే పాప కోసం ఫ్రాక్స్ తో పాటు మరికొన్ని బట్టలు కూడా కొనేసినట్లు చెబుతూ.. ఆఖరికి ఇండియాకు టికెట్స్ బుక్ చేయడంలో కూడా నిఖిత అనే పేరును నమోదు చేయించినట్లు తెలిపారు.

డెలివరీ అవ్వగానే షాక్

డెలివరీ అవ్వగానే షాక్

నిఖిత అనే పేరు నాకు చాలా ఇష్టం. అమ్మాయి పుడితే ఆ పేరే పెట్టాలని అనుకున్నాను. అయితే ఒక రోజు అమల నాకు ఫోన్ చేసి ఆశలు పెట్టుకోకండి అబ్బాయి పుడతాడని చెప్పింది. అయినప్పటికీ నమ్మలేదు. కానీ తీరా డెలివరీ అయ్యేసరికి అబ్బాయి అని తెలియగానే షాక్ అయ్యాను.ఏదో పొరపాటు జరగడం వలన స్కానింగ్ లో అలా చెప్పి ఉంటారని అనుకున్నాను.. అంటూ నాగార్జున వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X