For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో నిఖిల్‌ చేసిన పనులకు ఫ్యాన్స్ ఫిదా.. ఘనంగా సన్మానించిన కమీషనర్ సజ్జనార్!

  |

  వరస బాక్సాఫీస్ హిట్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకుంటున్న యువ హీరో నిఖిల్ కేవలం సినిమాలతోనే కాకుండా మంచి పనులతో కూడా జనాలకు మరింత దగ్గరవుతున్నాడు. స్టార్ హీరోగా ఎంత క్రేజ్ అందుకున్న కూడా ఎదుటి మనిషికి సహాయం చేయడంలోనే మంచి కిక్కు ఉందని ఈ హీరో అప్పుడప్పుడు నిరూపిస్తున్నాడు. ఇక అతను మంచి మనసుకు ఇటీవల కాలంలో అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ ఎక్కువవుతోంది. మిగతా హీరోలు కూడా నిఖీల్ తరహాలోనే మంచి పనులు చేస్తూ ఉంటే హీరోలను అభిమానించే ప్రేక్షకులకు కూడా ఎంతో స్ఫూర్తి దాయాకంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

  హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన మంచి పనులు చాలా వరకు బయటకు రాలేదు. లాక్ డౌన్ లో సోను సూద్ ఎలాగైతే సోషల్ మీడియా ద్వారా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నాడో అదే తరహాలో నిఖిల్ కూడా తన వంతు సహాయం చేసేందుకు కృషి చేశాడు. ఇక ఆ హీరో సేవలను గుర్తించిన చాలామంది ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ కూడా నిఖిల్ ను ప్రత్యేకంగా సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్‌లో నిఖిల్ చేసిన సేవలకు గాను సజ్జనార్ ప్రత్యేకంగా అభినందంచారు. కరోనా సెకండ్ వెవ్ లో ఎంతమంది పేదవాళ్లు సరైన వైద్య సదుపాయాలు లేక నానా కష్టాలు పడ్డారు. అయితే వారందరికీ నిఖిల్ వీలైనంత వరకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

   Hero Nikhil siddarth was felicitated by the Commissioner of Police

  అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలిండర్లను అలాగే మెడిసిన్స్ అందజేస్తూ రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు. కోవిడ్ సమయంలో ఈ హీరో చేసిన సేవలను గుర్తించిన సజ్జనార్ ప్రత్యేకంగా సన్మానించారు. నిఖిల్‌ లోని మానవతా దృక్పతాన్ని మెచ్చుకుంటూ.. ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్ చాలా మందికి స్పూర్తిగా నిలిచారని, సెకండ్ వేవ్‌లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేసినట్లు వివరణ ఇచ్చారు. మెడికల్ కిట్స్‌తో పాటు కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకున్న నిఖిల్ ఎంతోమంది ప్రాణాలు కాపాడి మంచి మనసున్న హీరోగా నిలిచారని కూడా అన్నారు.

  Hero Nikhil ఎమోషనల్.. మిగిలింది అదొక్కటే.. అందరికీ ఇచ్చి పడేశాడు!! || Filmibeat Telugu

  పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో పాటు మరికొంత మంది ఉన్నతాధికారులు కూడా నిఖిల్ ను ప్రత్యేకంగా సన్మానించారు. ఇక నిఖిల్ సిద్ధార్థ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా 2019లో అర్జున్ సురవరం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. ఆ తరువాత లాక్ డౌన్ లోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. ఇక సుకుమార్ రైటింగ్స్ లో 19 పేజెస్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ అయితే మొత్తం పూర్తయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ఆల్ మోస్ట్ పూర్తి అయ్యాయి. ఎలాగైనా ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

  English summary
  Hero Nikhil siddarth was felicitated by the Commissioner of Police,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X