తొలినాళ్లలో అది చాలనుకునేవాడిని.. ఈ పరిణామం అస్సలు ఊహించలేదు.. ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా వెండితెరపై కాలుమోపిన ప్రభాస్ సినిమా సినిమాకు తన పాపులారిటీ పెంచుకుంటూ వచ్చారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఆయన మరికొద్ది రోజుల్లోనే సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ పై అభిప్రాయం పంచుకున్నారు.
తాను సినీ కెరీర్ ప్రారంభమైన తొలి రోజుల్లో వెండితెరపై హీరోగా గుర్తింపు వస్తే చాలని అనుకునే వాడినని చెప్పారు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాకు 'వర్షం' సినిమా హిట్ అయ్యాక మంచి విజయం వచ్చిందనే ఫీలింగ్ కలిగిందని చెప్పారు. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' సినిమాతో క్లారిటీ వచ్చిందని, తాను సినిమాల పరంగా సరైన దారిలోనే వెళుతున్నాననే కాన్ఫిడెన్స్ ఈ సినిమాతోనే వచ్చేసిందని అన్నారు. అయితే ప్రస్తుతం తనకున్న స్థానాన్ని ఏనాడూ కలలో కూడా ఊహించలేదని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

ఇక ప్రభాస్ సాహో విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఆగస్టు 30 న ఈ సినిమా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











