Introducing Pusha Raj: రికార్డుల దుమ్ముదులిపిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ఏ హీరోకు దక్కని ఘనత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న పుష్ప మూవీ రిలీజ్‌కు ముందే పలు రికార్డులను తిరగరాస్తున్నది. రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పుష్ప టీజర్‌కు అన్ని భాషల నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో పుష్ప సృష్టించిన తాజా రికార్డుల్లోకి వెళితే..
Recommended Video

కింగ్ ఆఫ్ సోషల్ మీడియాగా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో బలమైన అభిమానగణం ఉంది. బన్నీకి సంబంధించిన ఎలాంటి వీడియో పెట్టినా రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్ నమోదు అవుతుంటాయి. అందుకే అల్లు అర్జున్‌ను కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అనే అవార్డు కూడా దక్కింది.

తొలి రోజే రికార్డు దిశగా
Introducing Pushpa Raj అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి రోజే పుష్ప టీజర్ భారీ రెస్సాన్స్‌ను మూటగట్టుకొన్నది. టీజర్‌లోని అల్లు అర్జున్ యాక్షన్ సీన్లు, అలాగే ఒకే ఒక డైలాగ్.. తగ్గేదిలే అభిమానుల గుండెల్లోకి చేరిపోయాయి. దాంతో ఎవరూ ఊహించని విధంగా రికార్డు వ్యూస్, లైక్స్ సాధించింది.

టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
టాలీవుడ్‌లో ఏ హీరో సాధించిన విధంగా పుష్ప టీజర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ టీజర్ కేవలం మూడు రోజుల్లోనే 1.1 మిలియన్ లైక్స్ సాధించింది. ఆ తర్వాత 11 రోజుల్లోనే 1.2 మిలియన్స్ అంటే 12 లక్షల లైక్స్‌ను సొంతం చేసుకొన్నది. RRRకు సంబంధించిన Ramaraju for Bheem 40 రోజుల్లో ఈ ఘనతను సాధించింది.

అత్యంత వేగంగా పుష్ప టీజర్ వ్యూస్
టాలీవుడ్‌లో పుష్ప టీజర్ మరో రికార్డును కూడా సొంతం చేసుకొన్నది. ఫాస్టెస్ట్‌గా 1.2 మిలియన్ లైక్స్ సాధించడమే కాకుండా అత్యంత వేగంగా 44 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి చిత్రంగా పుష్ప టీజర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకొన్నది. దీంతో మరోసారి అల్లు అర్జున్ కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











