For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ నెం.1 ప్లేస్ లోకి దూసుకొచ్చిన ఎన్టీఆర్.. ప్రభాస్, మహేష్ వెనక్కి.. ఎవరి పొజిషన్ ఏంటంటే?

  |

  ఒకప్పుడు తెలుగు వరకే పరిమితం అయిన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవుతున్నారు. బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ఇండియాలోనే కాక పలు దేశాల్లో అభిమానులను సంపాదించుకోగా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మన హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు దేశ వ్యాప్తంగా సత్తా చాటారు. అయితే అలా దేశవ్యాప్తంగా సత్తా చాటినా తెలుగులో నెంబర్ వన్ ఎవరంటే చెప్పడం కష్టమే. అందుకే మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎవరికీ ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరి గురించి చర్చ జరిగింది అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక లిస్ట్ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ సర్వే ఏప్రిల్ 2022 నెలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఆ జాబితాలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ మొదటి స్థానానికి వచ్చాడు. అలాగే కొందరు హీరోల స్థానాలు మారాయి. ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే..

  1-ఎన్టీఆర్ 2-ప్రభాస్

  1-ఎన్టీఆర్ 2-ప్రభాస్

  పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో ఏడాది పాటు ఏక చక్రాధిపత్యం కొనసాగించిన మహేష్ బాబుని కాదని జనవరి, ఫిబ్రవరి నెలలకు అల్లు అర్జున్, మర్చి నెలకు ప్రభాస్ దక్కించుకోగా ఈసారి మరోమారు ఆ స్థానం మారింది. ఈసారి ఎన్టీఆర్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. మార్చిలో మూడో స్థానంలో ఉన్న ఎన్టీఆర్ ఈ నెలలో మొదటి స్థానానికి ఎగబాకారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేయగా అది మార్చి నెలలో విడుదలైంది. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఆయనకు లభించిన క్రేజ్ కు స్థానం లభించింది. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. ఇక మార్చి నెలలో ఒకటో స్థానంలో ఉన్న ప్రభాస్ ఏప్రిల్ నెలలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కొద్ది రోజుల క్రితమే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నారు.

   3-అల్లు అర్జున్ 4- రామ్ చరణ్

  3-అల్లు అర్జున్ 4- రామ్ చరణ్


  ఇక జనవరి ఫిబ్రవరి నెలలో మొదటి స్థానం తెచ్చుకున్న అల్లు అర్జున్ మార్చి నెలలో రెండో స్థానానికి చేరాడు. ఈసారి మూడో స్థానానికి చేసారు. ఇక చివరిగా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటాడు. ఆ సినిమా రెండో భాగం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన గత నెలలో ఆరో స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకారు. రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కొరటాల శివ చిరంజీవిల ఆచార్యలో కూడా ఆయన నటించగా ఆ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

  5 మహేష్ బాబు 6-పవన్ కళ్యాణ్

  5 మహేష్ బాబు 6-పవన్ కళ్యాణ్


  వరుసగా పన్నెండు నెలలు మొదటి స్థానంలో ఉంటూ వచ్చిన మహేష్ జనవరిలో నాలుగో స్థానానికి పడిపోగా ఈ సారి ఏకంగా ఐదో స్థానానికి దిగజారాడు. చివరిగా సర్కారు వారి పాట అనే సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా పూర్తయింది కాబట్టి ఆయన త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయనున్నారు. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో నాలుగో స్థానంలో ఉండగా అక్కడి నుంచి ఐదో స్థానానికి దిగజారారు, ఈ నెలలో ఆరో స్థానానికి దిగజారారు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో పలకరించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ లో వెనుక పడింది. ఇక ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు.

  7-నాని 8-విజయ్ దేవరకొండ

  7-నాని 8-విజయ్ దేవరకొండ


  మార్చి నెలలో ఏడవ స్థానంలో ఉన్న నేచురల్ స్టార్ నాని ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో నిలవగా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అది విడుదల కాకముందే జనగణమన సినిమా మొదలు పెట్టారు. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.

   9-చిరంజీవి , 10- రవితేజ

  9-చిరంజీవి , 10- రవితేజ


  ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఆయన ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా కాకుండా చిరంజీవి మరో నాలుగు సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. ఇక ఈ జాబితాలో రవితేజ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

  English summary
  jr ntr and Prabhas Rated As NO.1 & 2 Stars In Tollywood at April 2022 Says ORMAX Survey
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X