For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR vs Ram Charan: ఫ్యాన్స్ మధ్య వార్: ఆ విషయంలో చెలరేగిన వివాదం.. దేశ వ్యాప్తంగా రచ్చ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి.. మెగా ఫ్యామిలీలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ రెండు కుటుంబాలకు చెందిన హీరోలే చాలా కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతుంటారు. ఆరంభం నుంచి మొన్నటి వరకూ ఈ రెండు ఫ్యామిలీల అభిమానులు కారాలు మిరియాలు నూరుకునేలా ఉండేవారు. అయితే, ఇప్పుడా పరిస్థితులు మారాయి. హీరోల మధ్య స్నేహం పెరిగినట్లు ఫ్యాన్స్ కూడా కలిసిపోయారు. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున అభిమానుల మధ్య వార్ మొదలైంది. అసలేం జరిగింది.? వివరాల్లోకి వెళ్తే...

  RRRలో కలిసి నటిస్తోన్న ఎన్టీఆర్ చరణ్

  RRRలో కలిసి నటిస్తోన్న ఎన్టీఆర్ చరణ్

  కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇలా వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRR (రౌద్రం రణం రుధిరం)లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లు.

  ఒకరు అలా... మకొకరు ఇలా... ఓ రేంజ్‌

  ఒకరు అలా... మకొకరు ఇలా... ఓ రేంజ్‌

  విప్లవ వీరులుగా పేరొందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో అల్లూరిగా.. రామ్ చరణ్.. భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్లకు సంబంధించిన లుక్స్ విడుదలవగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఒకరికి ఒకరు కలిశారు.. రికార్డ్స్ కొట్టారు

  ఒకరికి ఒకరు కలిశారు.. రికార్డ్స్ కొట్టారు

  గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్ ఫర్ రామరాజు' అనే వీడియో విడుదలైంది. దీనికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ తర్వాత తారక్‌కు సంబంధించిన ‘రామరాజు ఫర్ భీమ్' వీడియో వచ్చింది. దీనికి చరణ్ గొంతును అందించాడు. ఈ రెండు వీడియోలకూ ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో ఈ రెండూ టీజర్లు భారీగా వ్యూస్ సాధించి రికార్డులకెక్కాయి.

  ఇద్దరు హీరోల వల్ల ఫ్యాన్స్ మారారుగా

  ఇద్దరు హీరోల వల్ల ఫ్యాన్స్ మారారుగా

  RRRలో రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం వల్ల.. వాళ్లిద్దరికి సంబంధించిన ఫొటోలు తరచూ వైరల్ అవుతున్నాయి. తద్వారా ఈ హీరోల మధ్య స్నేహం బాగా పెరిగిందని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో ఈ హీరోలు అభిమానులు సైతం స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇధ్దరిని జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

  ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్ హడావిడి

  ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్ హడావిడి

  మే 20 అంటే ఈరోజు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్‌లో #ManOfMassesNTR, #HappyBirthdayNTR, #KomaramBheemNTR, తదితర హ్యాష్ ట్యాగులతో లక్షల సంఖ్యలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తారక్ పేరు ట్రెండ్ అవుతోంది.

  రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మొదలెట్టారు

  రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మొదలెట్టారు

  జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజునే రామ్ చరణ్ పేరు కూడా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఆయన అభిమానులు సైతం ఇదే రోజున #SeethaRAMaRajuCHARAN అనే హ్యాష్ ట్యాగ్‌తో లక్షల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఒకేరోజు ఇద్దరు RRR హీరోలు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. అయితే, ఓ విషయంలో మాత్రం ఇద్దరి మధ్య వార్ జరుగుతున్నట్లు కనిపించింది.

  ఇద్దరి మధ్య వార్.. దేశ వ్యాప్తంగా రచ్చ

  ఇద్దరి మధ్య వార్.. దేశ వ్యాప్తంగా రచ్చ

  ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఒకరికి పోటీగా ఒకరు ట్వీట్లు చేసుకోవడం వరకూ బాగానే ఉంది. కానీ, మాస్ హీరో ట్యాగ్ కోసం ఈ రెండు వర్గాల మధ్య వార్ జరుగుతోంది. చెర్రీ ఫ్యాన్స్ #ManOfMassesramcharan అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తుంటే.. తారక్ అభిమానులు #ManOfMassesNTR ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. కొందరైతే ఈ విషయంలో గొడవ కూడా పడుతున్నారు.

  English summary
  Jr NTR and Ram Charan Now Doing Tollywood Biggest Multi Starrer Movie RRR. On The Occasion of Tarak Birthday These Two Heros Fans Fighting in Twitter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X