Don't Miss!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- News
సింహంలా మీ బిడ్డ ఒక్కడే - పొత్తులపై గర్జించిన సీఎం జగన్ : అదే నా ధైర్యం..!!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
మెగా అల్లుడి సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. బిగ్ సర్‌ప్రైజ్
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా ద్వారా మెగా హీరోలకు బాగా దగ్గరయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తరువాత ఫ్యాన్స్ వార్స్ చాలా వరకు తగ్గాయి. అయితే గతంలో ఇతర హీరోలతో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉన్న సందర్భాలు చాలా ఎక్కువగా కనిపించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ తనవైపు నుంచి సపోర్ట్ అందించాడు.
ఇక ఇప్పుడు మరో మేనల్లుడికి కూడా ఎన్టీఆర్ సపోర్ట్ అందించబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా టైటిల్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే టీజర్ ను కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఆ సర్ ప్రైజ్ అప్డేట్ లో జూనియర్ ఎన్టీఆర్ భాగం కాబోతున్నాడు.

SDT 15వ ప్రాజెక్ట్ గా తెరపైకి వస్తున్న ఈ సినిమా ఒక థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్ టీజర్ ను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆ టీజర్ ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యనర్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అజయ్, బ్రహ్మాజీ, సునీల్ వంటి ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అవ్వడంతో రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు.