twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ప్రెస్ మీట్ లో ఏడ్చేసిన ఎన్టీఆర్.. పునీత్ కోసం పాడిన పాట పాడి ఇదే చివరి సారంటూ కంటతడి!

    |

    జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదలై సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా పది బాషలలో విడుదల చేస్తున్న కారణంగా సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరు వెళ్లిన ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏడ్చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    తెలివిగా సమాధానాలు

    తెలివిగా సమాధానాలు


    గురువారం ముంబైలో జరిగిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో రామ్ చరణ్ మినహా రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, డీవీవీ దానయ్య, అజయ్ దేవ్ గన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియా ఎన్టీఆర్ పై పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించగా అన్నింటికీ తెలివిగా సమాధానాలు చెప్పారు.

    వైభవాన్ని తీసుకొస్తుంద

    వైభవాన్ని తీసుకొస్తుంద

    ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, జనవరి 7న ఈ చిత్రం విడుదలవుతోందని... హిందీ ఆడియన్స్, విమర్శకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు. మన దేశంలో పెద్ద స్టార్లతో కలిసి పని చేయాలని అని తన కోరిక అంటూ బయటపెట్టారు. కరోనా వల్ల భారతీయ సినిమా కోల్పోయిన వైభవాన్ని మా ఈ సినిమా మళ్లీ తీసుకొస్తుందని చెప్పారు.

     ముంబై, బెంగళూరు, చెన్నైలలో ప్రెస్ మీట్

    ముంబై, బెంగళూరు, చెన్నైలలో ప్రెస్ మీట్


    మరోవైపు సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. హైదరాబాద్ తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నైలలో ప్రెస్ మీట్ కి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టగా ఫ్యాన్స్ దెబ్బకు హీరోలు బయటకు రాలేని పరిస్థితి. ఇక ఈరోజు బెంగళూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా కన్నడ మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

    బెంగళూరులో 'RRR' ప్రెస్ మీట్

    బెంగళూరులో 'RRR' ప్రెస్ మీట్


    ఈరోజు డిసెంబర్ 10న బెంగళూరులో 'RRR' ప్రెస్ మీట్ జరిగింది. 'ఆర్ఆర్ఆర్' ప్రచారానికి దర్శకుడు ఎస్ .ఎస్ . రాజమౌళి, నటి అలియా భట్, నటుడు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ బెంగళూరు చేరుకున్నారు. వీరంతా కర్ణాటక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలో అసలు హీరో ఎవరన్న ప్రశ్న ఎదురవగా రాజమౌళి తెలివిగా తానేనని సమాధానం ఇచ్చారు.

    కన్నీటి పర్యంతం

    కన్నీటి పర్యంతం

    విలేకరుల సమావేశంలో, తారక్ దివంగత కన్నడ సూపర్ స్టార్ మరియు అతని స్నేహితుడు పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకున్నారు. ఆయన లేని కర్ణాటక రావడం ఒక శూన్యంలోకి వచ్చినట్టు ఉండనై అన్నారు. ఆయన గౌరవార్ధం, తారక్ వేదికపై 'గెలెయా గెలెయా' పాటను పాడారు. పునీత్ గౌరవార్ధం, ఈ పాటను తాను ఇంకెప్పుడూ పాడనని కూడా వెల్లడించారు. ఇక ఆయన గౌరవార్ధం ఇదే చివరి సరి పాడుతున్నానని అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.

     ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై

    ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై

    బరువెక్కిన హృదయంతో ఉన్న ఎన్టీఆర్, "ఆయన ఎక్కడ ఉన్నా, అతని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి అని వెల్లడించారు. కన్నడలో మాట్లాడిన ఎన్టీఆర్ కన్నడిగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కన్నడిగులతో కన్నడ నేలపై కూర్చోవడం పట్ల ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు . ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

    English summary
    Jr NTR remember Puneeth RajKumar and got Emotional in RRR promotions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X