For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ: ఆ నిధులను కాపాడేందుకు గురూజీతో కలిసి ప్లాన్.!

  By Manoj
  |

  జూనియర్ ఎన్టీఆర్.... నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించి... రూపంలోనే కాకుండా నటనలోనూ ఆయనను మరిపిస్తున్న హీరో. టీనేజ్‌లోనే హీరోగా పరిచయమైన తారక్... తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్.. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడి ఫ్యూచర్ ప్లాన్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు

  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు

  ఆ మధ్య పరాజయాల పరంపరతో సతమతమైనప్పటికీ... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అప్పటి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు ఈ నందమూరి హీరో.

  చరిత్ర సృష్టించేందుకు మెగా హీరోతో జోడీ

  చరిత్ర సృష్టించేందుకు మెగా హీరోతో జోడీ

  ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అతడు కొమరం భీంగా నటిస్తున్నాడు. చరణ్.. అల్లూరి పాత్రను పోషిస్తున్నాడు. ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

  సినిమా కోసం సాహసాలు.. తారక్ ఇలా

  సినిమా కోసం సాహసాలు.. తారక్ ఇలా

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతోంది RRR. దీనిని దృష్టిలో ఉంచుకునే జక్కన్న అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చుతున్నాడు. అంతేకాదు, ఐదు భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు.

  హిట్ కాంబో రిపీట్.. అన్నతో మరోసారి

  హిట్ కాంబో రిపీట్.. అన్నతో మరోసారి

  RRR కారణంగా ఎన్టీఆర్‌కు దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే, దీని తర్వాత వీలైనంత త్వరగా సినిమాలు చేయాలని అతడు భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు తారక్. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. కల్యాణ్ రామ్, రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

  పేరు చూడగానే అలాంటి సినిమా అన్నారు

  పేరు చూడగానే అలాంటి సినిమా అన్నారు

  ‘అరవింద సమేత'తో సూపర్ హిట్‌ను అందుకున్న తారక్ - త్రివిక్రమ్ జోడీ... మరోసారి కలిసి పని చేయనుండడంతో అందరి కళ్లూ దీని మీదే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు రావడంతో... ఇది ఢిల్లీ నేపథ్యంతో సాగే పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న సినిమా అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

  జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

  జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

  గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్... పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న సినిమా చేస్తున్నాడన్న వార్త నందమూరి అభిమానుల్లో జోష్‌ను నింపింది. అప్పటి నుంచి దీనిని ఉద్దేశిస్తూ ఎన్నో వార్తలు ఇండస్ట్రీ ఏరియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  Bollywood Nepotism : RRR లో ఆలియా భట్ వద్దు అంటున్న Sushant Singh Rajput ఫ్యాన్స్
  ఆ నిధుల కోసం గురూజీతో కలిసి ప్లాన్.!

  ఆ నిధుల కోసం గురూజీతో కలిసి ప్లాన్.!

  తారక్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా రాజకీయ నేపథ్యంతో ఉండదని ఇటీవల ఓ న్యూస్ లీకైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా పురాతనమైన కోట చుట్టూ తిరుగుతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ కోటలో నిధులు ఉంటాయని, దానిని రక్షించే బాధ్యతను ఎన్టీఆర్ తీసుకుంటాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడట త్రివిక్రమ్.

  English summary
  Tollywood Young Hero Jr Ntr Busy with RRR Shooting. This movie Directed by SS Rajamouli. in This movie Mega power star Ram charan also Working. After This Ntr Will Work With Trivikram Srinivas Again.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X