కళ్యాణ్ రామ్ గూఢచారి ప్రయోగాలు.. లైన్ లో మరో డిఫరెంట్ మూవీ
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా వరకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటాడు. రెగ్యులర్ ఫార్మాట్ అయినప్పటికీ అందులో ఎదో ఒక పాయింట్ కొత్తగా ఉంటుంది. అయితే చివరగా వచ్చిన 'ఎంత మంచివాడవురా' సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ నందమూరి హీరో ప్రయోగాల డోస్ ను మరింత పెంచాడు. ఏకంగా హిస్టారికల్ పిరియాడిక్ కథలను టచ్ చేస్తున్నాడు.
ఇటీవల బింబిసార సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఓ వర్గం వారిలో భారీగా అంచనాలు పెంచారు. న్యూ డైరెక్టర్ వేణు మల్లిడి తెరకెక్కిస్తున్న ఆ సినిమా రిజల్ట్ పై కళ్యాణ్ రామ్ గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. ఇక ఆ సినిమా అనంతరం మరొక డిఫరెంట్ సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. 1950 టైమ్ లో జరిగే ఒక ఇన్వెస్టిగేషన్ కథలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ గూఢచారిగా కనిపిస్తాడని సమాచారం.

నెవర్ బిఫోర్ అనేలా ఉండే ఆ కథపై కూడా కళ్యాణ్ రామ్ గట్టి నమ్మకంతో ఉన్నాడట. ఆ సినిమాను కూడా కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ బిజీ అవుతున్నాడు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాను మారోకరితో కలిసి నిర్మించబోతున్నాడు. ఆ సినిమా అనంతరం మరొక హీరోతో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నిర్మాతగా, హీరోగా కళ్యాణ్ రామ్ ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











