twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునకు చాలా మంది హీరోయిన్లు అలా పడిపోయారు.. విక్రాంత్ రోణ వేదికపై సీక్రెట్ రివీల్ చేసిన కిచ్చ సుదీప

    |

    అనూప్ బండారీ దర్శకత్వంలో కిచ్చ సుదీప్ నటించిన విక్రాంత్ రోణ చిత్రం జూలై 28వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నీతా, దర్శకుడు అనూప్ బండారి, నాగార్జున అక్కినేని, జానీ మాస్టర్, విజయ్ మాస్టర్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదీప్ కిచ్చ మాట్లాడుతూ..

    శివ సినిమా చూసిన తర్వాత

    శివ సినిమా చూసిన తర్వాత


    నేను చూసిన మొట్టమొదటి సినిమా రాముడు భీముడు. మా అంకుల్ టెలివిజన్ కొని ఇంటికి తీసుకొస్తే.. ఆ సినిమాను టీవీలో చూశాను. నేను థియేటర్లలో చూసిన తొలి సినిమా శివ. స్కూల్ డేస్‌లో నాకు సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదు. ఆ సమయంలో శివ గురించి చాలా బజ్ ఉండటంతో ఆ సినిమాను చూశాం. రెండు రోజుల్లో మూడుసార్లు శివ చూడటం జరిగింది. శివ సినిమా చూసిన తర్వాత.. సైకిల్ చైన్‌ను అలా కూడా వాడొచ్చని అర్ధమైంది. అంతకు ముందు సైకిల్ చైన్ తెగిపోతే రిపేర్ షాపుకు వెళ్లే వాళ్లం.శివ చూసిన తర్వాత స్కూల్ బ్యాగులో పెట్టుకొని ఇతరులను బెదిరించే వాళ్లం అని అని కిచ్చ సుదీప అన్నారు.

    ఒక్క ఫోన్ కాల్‌తో నాగార్జున

    ఒక్క ఫోన్ కాల్‌తో నాగార్జున


    శివ సినిమా తర్వాత నాగార్జున అభిమానిగా మారిపోయాం. ఇప్పుడు నా అభిమాన నటుడి పక్కన నిలుచునే అవకాశం కలిగింది. ఒక్క ఫోన్ కాల్‌తో అన్నపూర్ణ స్టూడియో మొత్తం షూటింగ్ ఇచ్చారు. ఆ సమయంలో కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 500 మంది ఉన్న షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు. మా షూటింగు యూనిట్‌లో ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా స్టూడియో మొత్తం మూసేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో 7 ఎకరాల స్టూడియో మొత్తం మేమే వాడేసుకొన్నాం అని సుదీప్ తెలిపారు.

    ఒక్క నవ్వుతో నాగార్జున

    ఒక్క నవ్వుతో నాగార్జున


    నాగార్జున సినిమాలంటే ఇష్టం. వ్యక్తిగతంగా ఆయనలో ఉండే మానవత్వం మరీ ఇష్టం. ఆయన నవ్వు చాలా జెన్యూన్‌గా ఉంటుంది. ఆయన నవ్వుకు ఎంత మంది హీరోయిన్లు పడిపోయారేమో తెలియదు. మా లాంటి వాళ్లు ఆయన నవ్వు చూస్తే పడిపోతాం. ఆయన నవ్వు అలాంటింది. ఆయన మనస్తత్వం ఎవరికి ఉండదు అని సుదీప్ చెప్పారు.

     అన్నపూర్ణ స్డూడియోలో షూటింగ్

    అన్నపూర్ణ స్డూడియోలో షూటింగ్


    కోవిడ్ సమయంలో విక్రమ్ రోణ సినిమాను 90 శాతం హైదరాబాద్‌లోనే షూట్ చేశాం. మేము హైదరాబాద్‌లో షూట్ చేసిన మొత్తంలో అన్నపూర్ణ స్టూడియోలోనే 70 శాతం చేశాం. అన్నపూర్ణ స్టూడియో అద్భుతమైన ప్రదేశం. మూడు నెలలపాటు 500 మంది షూటింగ్ చేస్తే ఒక్కరికి కూడా కరోనా రాలేదు. అది వారి పెద్దల ఆశీర్వాదం వల్ల ఇది జరిగి ఉండొచ్చు. మంచి ప్రదేశంలో మంచి వాళ్లు ఉంటే.. అంతా మంచే జరుగుతుంది అని సుదీప్ పేర్కొన్నారు.

    విక్రాంత్ రోణకు సహకరించిన వారిలో

    విక్రాంత్ రోణకు సహకరించిన వారిలో


    విక్రమ్ రోణ గురించి చెప్పాలంటే.. ఆర్ట్ డైరెక్టర్ లేకపోతే డైరెక్టర్ అనూప్ ఏమి చేయలేకపోయే వాడు. ఈ సినిమాకు ఆయన మ్యాజిక్ చేశాడు. తక్కువ బడ్జెట్‌తో పెద్ద పెద్ద సెట్లు వేసి సినిమాను చాలా గ్రాండ్‌గా చేశారు. నేను ఒక డ్రీమ్ మనసులో అనుకొంటే.. మంజు, విజయ్ మాస్టర్, జానీ మాస్టర్ రియల్ చేశారు. రామజోగయ్య శాస్త్రి మీరు ఇంత మంచిగా పాటలు ఎలా రాస్తారు. తెలుగులో కంటే..కన్నడలోనే అద్భుతంగా పాటలు రాశారు అని పొగడ్తల్లో ముంచెత్తారు.

    విక్రాంత్ రోణను తెలుగు ప్రేక్షకుల ఆదరించాలి

    విక్రాంత్ రోణను తెలుగు ప్రేక్షకుల ఆదరించాలి

    తెలుగు ప్రేక్షకులు నాపై ఎప్పడూ ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. నేను ఈగ సినిమా చేసినా.. బాహుబలి సినిమాలో చిన్న పాత్ర వేసినా..సైరాలో నటించినా నన్ను బాగా ఆదరించారు. ఈగ సినిమా రిలీజ్ తర్వాత నాగార్జున నాకు ఫోన్ చేసి అభినందించారు. ఇది తెలుగు ప్రజల ప్రేమ నాపై ఉందనడానికి ఇది సాక్ష్యం. విక్రాంత్ రోణ చిత్రం జూలై 28న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఆదరించాలని కోరుకొంటున్నాను అని సుదీప్ కోరారు.

    English summary
    Kichcha Sudeep interestig comments about Nagarjuna Smile at Vikrant Rona event in Hyderabad. He said, Nagarjuna trapped many heroines with his smile. He has genuine smile.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X