PSPK RANA: బీమ్లా నాయక్ పాత్రపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఆ పేరు నిజమైనదే!

బీమ్లా నాయక్ పేరు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపించడంతో ఒక్కసారిగా ట్రెండ్ లిస్ట్ లోకి వచ్చేసింది. ఇక సినిమాకు సంబంధించిన గాసిప్స్ కూడా చాలానే పుట్టుకొస్తున్నాయి. ఇక అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు గాని రీసెంట్ గా పవన్ పాత్రకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయ్యింది.

సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ట్రైబల్ వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. నిజానికి భీమ్లా నాయక్ అనే పేరు ఎదో నామమాత్రంగా పెట్టింది కాదట. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. ఇక అందులో ఎక్కువగా భీమ్లా అనే పేరు చాలామందికి ఉంటుందట. ఒక ట్రైబల్ ఏరియాకు సంబంధించిన తాండా బ్యాక్ డ్రాప్ లోనే హీరో పాత్రను డిజైన్ చేశారట. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ఆలోచించి ఆ పాత్రను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం.

Latest update on PSPK RANA movie pawan kalyan role backdrop

నిజ జీవితంలోని సంఘటనలను అలాగే సమస్యలను ఆధారంగా చేసుకొని పవన్ తన ప్రతి సినిమాలో ఎదో ఒక మెస్సేజ్ ఇవ్వాలని అనుకుంటాడు. ఈ సినిమా మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ అయినప్పటికీ ఉన్నది ఉన్నట్లుగా కొన్ని విభిన్నమైన సన్నివేశాలను మార్చబోతున్నారట. కథలో అసలు పాయింట్ మిస్సవ్వకుండా కొన్ని సామాజిక అంశాలను హైలెట్ చేస్తారని టాక్ వస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తో సమానంగా రానా దగ్గుబాటి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. లుక్కుతోనే హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న రానా ఈ సినిమాతో తెలుగులో కూడా బాహుబలి లాంటి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ సెట్ చేసుకున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X