హిట్టు ఎఫెక్ట్.. మాటల మాంత్రికుడిపై మహేష్ కోపం తగ్గినట్లేనా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో సత్తా చాటకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికి ఆ సినిమా ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదు. టీవీలలో ఎన్ని సార్లు ప్రదర్శించిన మంచి రేటింగ్ ని అందిస్తుంది. అయితే ఆ తరువాత వచ్చిన ఖలేజా మాత్రం ఊహించని దెబ్బ కొట్టింది.
సినిమా మధ్యలో ఆగిపోవడంతో పాటు మహేష్ కెరీర్ ని ఒక్కసారిగా దెబ్బకొట్టడంతో త్రివిక్రమ్, మహేష్ లకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. సినిమా మిస్ ఫైర్ అవ్వడానికి వేరే కారణాలు ఉన్నప్పటికీ ఆ తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని టాక్ వచ్చింది. కానీ మహేష్ కావాలనే త్రివిక్రమ్ ని రిజెక్ట్ చేశాడని కొంత కోపం ఉందనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఫైనల్ గా వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగినట్లు తెలుస్తోంది.

పైగా మాటల మాంత్రికుడు అల..వైకుంఠపురములో.. వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడంతో ఏ హీరో అయినా ఆయన డేట్స్ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అయిపోగానే మరొక సినిమాని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ఇటీవల మహేష్ కి ఒక కథను చెప్పాడట. మహేష్ కూడా సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే


Click it and Unblock the Notifications











