For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్: మహేశ్ బాబు ఖాతాలో అరుదైన రికార్డ్.. ఒకే ఒక్క సినిమాతో రూ. 82 కోట్లు సంపాదన.!

  By Manoj Kumar P
  |

  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో మహేశ్ బాబు కొంత ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి కారణం ఆయన వ్యవహరిస్తున్న శైలే. సినిమాలకు సినిమాలు.. వ్యాపార ప్రకటనలు.. బిజినెస్.. బ్రాండ్ అంబాసీడింగ్.. ఇలా అన్ని రకాలుగా సంపాదిస్తూ దూసుకుపోతున్నాడీ సూపర్ స్టార్. దీంతో పక్కా బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ బాబు ఓ సినిమా ద్వారా రికార్డు స్థాయిలో రూ. 82 కోట్లు సంపాదించాడట. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

  సరిలేరు అంటూ వచ్చి.. సక్సెస్ అయ్యాడు

  సరిలేరు అంటూ వచ్చి.. సక్సెస్ అయ్యాడు

  సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. డీఎస్పీ మ్యూజిక్ ఇచ్చాడు.

  హ్యాట్రిక్ కొట్టాడు.. మార్కెట్ పెంచుకున్నాడు

  హ్యాట్రిక్ కొట్టాడు.. మార్కెట్ పెంచుకున్నాడు

  సరిలేరు నీకెవ్వరు విజయంతో మహేశ్ బాబు వరుసగా మూడో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీని కంటే ముందు ఈ స్టార్ హీరో వరుసగా ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్ చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. ఈ హ్యాట్రిక్ విజయాలతో మహేశ్ బాబుకు మార్కెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  కలెక్షన్ల సునామీ.. బ్లాక్‌బస్టర్‌కా బాప్

  కలెక్షన్ల సునామీ.. బ్లాక్‌బస్టర్‌కా బాప్

  సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు' సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ చిత్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ మహేశ్ బాబు సినిమా సత్తా చాటింది. ఈ క్రమంలోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొత్తంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టింది. అలాగే, రూ. 200 కోట్లకు పైగా గ్రాన్‌ను దక్కించుకుంది.

  ఒకే ఒక్క సినిమాతో రూ. 82 కోట్లు సంపాదన.!

  ఒకే ఒక్క సినిమాతో రూ. 82 కోట్లు సంపాదన.!

  ఈ సినిమాకు గానూ మహేశ్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా దీని వెనుక అసలు మేటర్ లీక్ అయింది. ఇప్పటి వరకు రూ. 20 - 25 కోట్లు చార్జ్ చేసిన సూపర్ స్టార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీతో రూ. 82 కోట్లు ఆర్జించాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  డుయల్ రోల్‌తో మహేశ్ ఖాతాలో అరుదైన రికార్డ్

  డుయల్ రోల్‌తో మహేశ్ ఖాతాలో అరుదైన రికార్డ్

  సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాకు మహేశ్ దాదాపుగా రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడట. అలాగే, దీనికి సహా నిర్మాతగా వ్యవహరించిన అతడు.. రూ. 52 కోట్ల వరకు లాభ పడ్డాడని తెలుస్తోంది. దీంతో మొత్తంగా మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ ద్వారా నిర్మాతగా, హీరోగా కలిపి రూ. 82 కోట్లు సంపాదించాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

  Bandla Ganesh Gratitude Towards Mahesh Babu | Sarileru Neekevvaru || Filmibeat Telugu
  విశాఖ కేంద్రంగా వ్యాపారం.. సరికొత్త యాంగిల్

  విశాఖ కేంద్రంగా వ్యాపారం.. సరికొత్త యాంగిల్

  ‘సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు.. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సినిమాలో సూపర్ స్టార్.. గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం కేంద్రంగా వ్యాపార వ్యవహారాలు చూసుకునే పాత్రలో అతడు నటించనున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి విధితమే.

  English summary
  Sarileru Neekevvaru is a 2020 Indian Telugu-language action comedy film written and directed by Anil Ravipudi. The film stars Mahesh Babu as Indian Army Major Ajay Krishna and Rashmika Mandanna as Samskruthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X