బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ సొంత ఇమేజ్‌ను ఏర్పరచుకుని స్టార్ హీరోగా ఎదిగాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటాడాయన. ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. జనవరి మూడో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
ఇది పట్టాలెక్కక ముందే మహేశ్ బాబు.. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొద్ది రోజులు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే వీళ్లిద్దరూ పలుమార్లు కలిసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మాఫీయా నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్ కథతో ఈ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ప్రకటన వెలువడక ముందే.. మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టుకు సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమాకు సూపర్ స్టార్ పచ్చజెండా ఊపాడట.
గత ఏడాది యంగ్ హీరో నితిన్‌తో 'భీష్మ' అనే సినిమా తీసి హిట్ కొట్టిన వెంకీ కుడుముల.. కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసి, ఓ లైన్ వినిపించాడట. ఇది ఆయనకు బాగా నచ్చిందని, దీంతో ఈ కథను పూర్తి చేసి తీసుకు రమ్మని అతడికి చెప్పాడని సమాచారం. దీంతో వెంకీ ఇటీవల పూర్తి కథను మహేశ్‌కు వినిపించగా.. వెంటనే ఓకే చెప్పేశాడని తెలిసింది. 'సర్కారు వారి పాట', వంశీ పైడిపల్లి సినిమాల తర్వాత ఇది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Venky Kudumula is an Indian film director who works in Telugu-language films. He has directed two films: Chalo (2018) and Bheeshma (2020). He has been in some controversy with Chalo's lead actor Naga Shourya. Naga Shourya has claimed that Venky is a ungrateful person who changed his phone number after Chalo's success. The reason for the fallout is not exactly know.
Story first published: Sunday, January 3, 2021, 13:55 [IST]