twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్.. ప్లాస్మా డొనేషన్‌పై మహేష్ బాబు

    |

    ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు కొన్ని వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అంతే స్థాయిలో రికవరీ కూడా అవుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడాలని, వాటి గురించి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మహేష్ బాబు మద్దతు తెలిపాడు.

    ఈ మేరకు మహేష్ బాబు స్పందిస్తూ.. 'ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరొకొకరం తోడుగా ఉండడం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ప్లాస్మా డొనేషన్ ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలియజేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ ఎవర్నేస్‌తో ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అందరినీ అభినందిస్తున్నారు. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడడానికి దోహదపడే ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ రిక్వెస్ట్ చేస్తున్నాను.

    mahesh Babu Request To Fans About Plasma Donation

    ముఖ్యంగా నా బర్త్ డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ ప్లాస్మా డొనేట్ చేయాలని విప్తి చేస్తున్నాను. ఈ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్‌ను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్‌కి అభినందనలు. ముఖ్యంగా అనుక్షణం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, ఈ ప్లాస్మా డొనేషన్ గురించి ప్రజలకు చెప్తూ ఎందరో ప్రాణాల్ని కాపాడుతున్న సజ్జనార్ గారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దనాం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్లవుతారు. ప్లాస్మా డొనేట్ చేయండి.. ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టండి' అని వేడుకున్నాడు.

    English summary
    mahesh Babu Request To Fans About Plasma Donation, mahesh Babu Request To His Fans To Conduct Awareness Programmes About Importance of Plasma Donation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X