For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 రోజుల్లో అన్ని కొట్టేశాం... ‘మహర్షి’ కలెక్షన్లపై మహేష్ బాబు రియాక్షన్!

|

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలివారంలోనే ఇప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

విజయంపై సూపర్ హ్యాపీగా ఉన్న మహేష్ బాబు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ చిత్రం తనకు ఎంత ప్రత్యేకమో చెప్పే ప్రయత్నం చేశారు. అంతే కాదు ఈ మూవీ వసూళ్ల గురించి కూడా ప్రస్తావించారు. సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేసిన అంశంపై స్పందించారు.

పోకిరి స్వేర్ అని అప్పుడే చెప్పా

సాధారణంగా నా సినిమా రిలీజ్ ముందు నర్వస్‌గా ఉంటాను. కానీ ఈ సినిమా విషయంలో నర్వస్ అవుదామన్నా కుదరలేదు. ఎందుకంటే ఫస్ట్ డే షూటింగ్ నుంచే పూర్తి నమ్మకం ఉంది. ఇది పోకిరి స్కేర్ అని వంశీకి, నా స్నేహితులకు ముందే మెసేజ్ పెట్టినట్లు మహేష్ తెలిపారు.

గర్వపడే సినిమా

ఈ సినిమా నా 25వ సినిమా కావడం, ఇలాంటి స్క్రిప్టు నాకు రావడం చాలా లక్కీ. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే బెస్ట్ చిత్రంగా ఉంటుంది. నా పిల్లలకు ఇలాంటి సినిమా నేను చేశాను అని గర్వంగా చెప్పుకోగలను. ఇంతకంటే ఈ సినిమా గురించి చెప్పడానికి పెద్ద స్టేట్మెంట్ ఉండదనని మహేష్ చెప్పుకొచ్చారు.

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు మహేష్ బాబు వేరు

సంవత్సరం షూటింగ్ ప్రాసెస్‌లో చాలా మారిపోయా... అంతకు ముందు నేను డిఫరెంట్ మహేష్ బాబు, ఇపుడు డిఫరెంట్ మహేష్ బాబు అని చెప్పుకొచ్చారు. మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై దర్శకుడు వంశీపైడిపల్లి రియాక్ట్ అవుతూ నాకు, మా సినిమాకు ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఉండదన్నారు.

సినిమా అంటే ఒక్క హీరో మాత్రమే కాదు

ఈ సినిమాలో నాకు ఇష్టమైన సీన్ ఒకటి అని ఏమీ లేదు. ఎంటైర్ ఫిల్మ్ నా ఫేవరెట్. రిషి క్యారెక్టర్, జర్నీ ఇలా అన్నీ ప్రత్యేకమే. కంప్లీట్ స్క్రిప్టులో నా ఒక్క క్యారెక్టర్ మాత్రమే కాదు, చాలా పాత్రలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా అన్ని పాత్రలను మెర్జ్ చేశారు. సినిమా అంటే హీరో ఒక్కరే ఉంటే సరిపోదు. అన్ని పాత్రలు ఉండాలి. ప్రతి క్యారెక్టర్ ముఖ్యమే అని మహేష్ వెల్లడించారు.

7 రోజుల్లో అన్ని కొట్టేశాం

ఈ సినిమా చేయడం వల్ల కేవలం పేరు మాత్రమే కాదు... గొప్ప రెస్పెక్ట్ వచ్చింది. కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీంతో పాటు ఒక మ్యాజిక్ జరిగింది. నా కెరీర్లో ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అన్నింటినీ కేవలం 7 రోజుల్లో క్రాస్ చేయడం మామూలు విషయం కాదు. ఇది నాకు ఒక గొప్ప బహుమతి. ఇలాంటి విజయం రావడానికి కారణమైన దర్శకుడికి, నిర్మాతలకు, టీమ్ మొత్తానికి థాంక్స్ అని మహేష్ వ్యాఖ్యానించారు.

సక్సెస్ మీట్లో కాలర్ ఎగరవేయడం ప్లాన్ చేసింది కాదు..

సక్సెస్ మీట్లో కాలర్ ఎగరవేయడం ప్లాన్ చేసింది కాదు. నేను అలా చేసే వ్యక్తిని కాదు అని అందరికీ తెలుసు. ఆ సమయంలో నిజంగా ఎమోషనల్ అయ్యాను. సినిమాకు వస్తున్న స్పందన, రెస్పెక్ట్ చూసి గర్వంగా ఫీలయ్యాను. ఈ క్రమంలోనే కాలర్ ఎగరవేసినట్లు మహేష్ బాబు తెలిపారు.

మహర్షి

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

English summary
Mahesh Babu Sharing Maharshi Movie Success and collections. Maharshi directed by Vamsi Paidipally and jointly produced by Dil Raju, C. Ashwini Dutt, and Prasad V. Potluri through their production companies Sri Venkateswara Creations, Vyjayanthi Movies, and PVP Cinema. The film stars Mahesh Babu, Allari Naresh, and Pooja Hegde.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more