Don't Miss!
- News
`గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి`: మంత్రి గుడివాడ లేఖ: సింగిల్ పేజ్‌లో ఫుల్ క్లారిటీ
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Mahesh babu: ఆ విషయంలో నమ్రతతో మాట్లాడను.. నా నిర్ణయమే ఫైనల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్న మహేష్ బాబు రీసెంట్ గా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అనేక రకాల విషయాలపై క్లారిటీ వచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొన్ని కమర్షియల్ యాడ్స్ తో పాటు ఇందుకు సంబంధించిన బ్రాండ్ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొంటున్నాడు. అయితే నమ్రత గురించి కూడా మహేష్ బాబు ఒక విషయంలో పూర్తిగా క్లారిటీ ఇచ్చేశాడు.

వెండితెరకు దూరంగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ అదే ఏడాది మరో సినిమాతో రావాలని అనుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ వలన మహేష్ ఈ ఏడాది కూడా వెండితెరకు దూరం కావాల్సి వస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

మహేష్ సెలక్షన్ లో నమ్రత పాత్ర
అయితే మహేష్ బాబు సినిమా కథల ఎంపిక విషయంలో చాలామంది పాత్ర ఉంటుందని గతంలో అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా నమ్రత వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా ఆమె ఆధీనంలోనే స్క్రిప్టులు కూడా ఫైనల్ అవుతున్నాయని అంతేకాకుండా ఆమె కోరితే కథలో మార్పులు కూడా చేయడానికి చాలామంది దర్శకుడు సిద్ధం అవుతారని కూడా టాక్ వచ్చింది. ఆ విషయంలో మహేష్ బాబు ఒక క్లారిటీ చేశాడు.

అందులో నిజం లేదు
మహేష్ బాబు ప్రయోగాలు బాగానే చేసినప్పటికీ కొంచెం కమర్షియల్ యాంగిల్ లో కూడా ఆలోచించి అన్ని విధాలుగా సినిమా వర్కవుట్ అవుతుంది అంటేనే ఓకే చేస్తున్నాడు. అయితే ఆ సినిమా కథల ఎంపిక విషయంలో నమ్రత పాత్ర కూడా ఉంటుందని విషయంలో ఎలాంటి నిజం లేదని మహేష్ బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు.

ప్లాప్ అయినా కూడా
నేను వినే ప్రతి స్క్రిప్ట్ కూడా నా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నాకు నచ్చితేనే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. నమ్రతతో కూడా నా సినిమాల ఎంపిక విషయంలో ఏ మాత్రం చర్చలు జరపను. చర్చల తర్వాత సినిమా ఫ్లాప్ అయినా కూడా దాని నుంచే ఎంతగానో నేర్చుకుంటాను.. అని మహేష్ బాబు చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. స్టార్డమ్ అన్నది కూడా బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదని మహేష్ బాబు తెలియజేశాడు.
Recommended Video

ఎక్కువగా వారితోనే..
టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం లో బెస్ట్ సెలబ్రిటీస్ గా మహేష్ బాబు నమ్రత కొనసాగుతున్న విషయం తెలిసిందే. వంశీ సినిమాతో మొదటిసారి కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. కొడుకు గౌతమ్ కూతురు సితార లతో మహేష్ వీలైనంత వరకు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక షూటింగ్ కు ఏ మాత్రం బ్రేక్ వచ్చినా కూడా వారితో ఎక్కడికైనా హాలిడేస్ కు వెళ్లాలని కూడా అనుకుంటారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా నమ్రతా తన భర్త ఫోటోలతో పాటు పిల్లల ఫోటోలు కూడా షేర్ చేస్తూ అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తారు.