టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. కమర్షియల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న మాస్ రాజా గతంలో మాదిరిగా అయితే వరుస సక్సెస్ లు అందుకోవడం లేదు. అప్పట్లో రవితేజ సినిమా అంటే మినిమమ్ వసూళ్లు అందుకునేవి.
కానీ ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా నష్టాల్లో పడేస్తున్నాయి. ఇక ఈ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఒకటిగా నిలిచిన సినిమా డిస్కో రాజా. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఆ సినిమా ఏ మాత్రం లాభాలు తేలేకపోయింది. ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. మాస్ రాజా కూడా బాగానే కష్టపడ్డాడు గాని వర్కౌట్ కాలేదు.
ఇక ఇప్పుడు క్రాక్ సినిమాను కూడా అదే నెలలో తీసుకురాబోతున్నాడు. 2021 జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. డాన్ శీను, బలుపు సినిమాల అనంతరం దర్శకుడు గోపిచంద్ మలినేని రవితేజతో చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు అయితే కొంతవరకు బాగానే ఉన్నాయి. మరి ఈ కరోనా కష్ట కాలంలో సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.
There is no doubt that in the coming days, the OTT will be increasing in the film industry. Now a corollary for that matter has been a lot of people. They are coming to a decision that it would be better if all the films that are ready for release are released in OTT at the lowest possible rate. Others do not even accept how many offers are coming.
Story first published: Sunday, December 20, 2020, 16:50 [IST]