Ram Charan: సోషల్ మీడియాలో మరో రికార్డు అందుకున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. మెగా వారసత్వం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. రంగస్థలం సినిమాలో చెర్రీ నటన ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తన మార్కెట్ ను పెంచుకుంటున్న రామ్ చరణ్ నెక్స్ట్ RRR తో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం కాయంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల ఈ మెగా హీరో సోషల్ మీడియాలో మరొక రికార్డును అందుకున్నాడు. ఇప్పటికే ఫేస్ బుక్ లో 5.4 మిలీయన్ల ఫాలోవర్స్ ఉండగా ట్విట్టర్ లో 1.3మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా 4మిలీయన్స్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని టాప్ ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచారు.

ఇక RRR అనంతరం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించనున్న ఆ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కనుంది. అయితే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. శంకర్ ఇండియన్ 2 విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తయితే గాని మరొక సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. దీంతో రామ్ చరణ్ సినిమా ఈ ఏడాది పట్టాలెక్కుతుందా లేదా అనే విషయం అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసింది.


Click it and Unblock the Notifications











