Don't Miss!
- News
మంత్రిని పొట్టనబెట్టుకున్న ఎస్ఐ: ఛాతీలో దిగిన బుల్లెట్లు..!!
- Sports
మహిళా క్రికెట్లో సంచలనం.. ప్రపంచకప్ గెలిచిన భారత్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ram Charan దసరా స్పెషల్స్.. నేషనల్ అవార్డు డైరెక్టర్ తో ఒకటి.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ తో మరోటి!
వరుస పాన్ ఇండియా సినిమాలుతో ప్రేక్షకులను అలరిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దసరా సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ చేసి అభిమానులకు డబుల్ బొనాంజా అందించారు. దాదాపు ఆయన చేస్తున్న ఐదు సినిమాలు కూడా పాన్ ఇండియా లోనే విడుదల అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ దసరా సందర్భంగా విడుదలైన రెండు సినిమాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఆర్ఆర్ఆర్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో రామ్ చరణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా పూర్తయిన తరువాత చాలా గ్యాప్ తీసుకున్న చరణ్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఆచార్య
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రామ్ చరణ్ ఈ సినిమా కాకుండా తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో
ఇవి రెండూ రామ్ చరణ్ 13, 14 సినిమాలు కాగా ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమా లాంఛనంగా మొదలు పెట్టగా షూట్ మాత్రం కొద్ది రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ నటించే తర్వాతి రెండు సినిమాలకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కు కూడా దసరా సందర్భంగా విడుదల చేశారు.
|
రామ్ చరణ్-గౌతమ్ తిన్ననూరి
ఈ
రోజున
ముందు
16వ
సినిమాను
ప్రకటించారు.
'జెర్సీ'
ఫేమ్
గౌతమ్
తిన్ననూరి
దర్శకత్వంలో
రూపొందే
చిత్రంలో
తాను
నటించనున్నట్టు
సోషల్
మీడియా
ద్వారా
ప్రకటించారు
రామ్
చరణ్.
'మీ
కథలో
నన్ను
నేను
చూసుకోవడానికి
ఎదురుచూస్తున్నాను
గౌతమ్..'
అంటూ
చరణ్
ట్వీట్
చేశారు.
తర్వాత
ఒక
స్పెషల్
పోస్ట్
షేర్
చేసి
మీరు
చూపించే
ప్రేమకు
థ్యాంక్యూ
చరణ్
సార్..'
అంటూ
తన
దర్శకుడు
గౌతమ్
ఒక
పోస్ట్
చేశారు.
యూవీ
క్రియేషన్స్
సంస్థ,
ఎన్వీర్
ఫిలిమ్స్
సంస్థలు
సంయుక్తంగా
నిర్మిస్తున్నాయి

కేజీఎఫ్ క్రేజ్
ఇక
ఆలాగే
కేజీఎఫ్
అనే
కన్నడ
సినిమాను
దేశ
భాషల్లో
డబ్బింగ్
చేసి
దేశ
వ్యాప్తంగా
క్రేజ్
తెచ్చుకున్న
దర్శకుడు
ప్రశాంత్
నీల్.
యష్
అనే
హీరోతో
కేజీఎఫ్
చిత్రాన్ని
తెరకెక్కించి
సెన్సేషన్
క్రియేట్
చేసిన
ప్రశాంత్
నీల్
తెరకెక్కించిన
కేజీఎఫ్
2
ఇప్పుడు
విడుదలకి
సిద్ధంగా
ఉంది.
ఇక
ఈ
సినిమా
తరువాత
ప్రశాంత్
నీల్
ప్రభాస్
సలార్
చిత్రంతో
బిజీగా
ఉన్నాడు.
ఈ
సినిమాను
కూడా
భారీ
బడ్జెట్‌తో
అత్యంత
ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కిస్తున్నాడు.
త్వరలో
ఎన్టీఆర్,
రామ్
చరణ్,
అల్లు
అర్జున్,
ప్రభాస్‌లతో
సినిమాలు
చేయనున్నట్టు
ప్రచారం
జరుగుతూ
ఉండగా
ఆసక్తికరంగా
ప్రశాంత్
నీల్
రామ్
చరణ్
ఇంట్లో
ప్రత్యక్షం
అయ్యాడు.
Recommended Video
|
ప్రశాంత్ నీల్ తో
స్వయానా రామ్ చరణ్.. ప్రశాంత్ నీల్‌ని తన ఇంటికి ఆహ్వానించగా ఆ సమయంలో చిరంజీవితో కలిసి ప్రశాంత్ నీల్, చరణ్ ఫొటో దిగారు. ముందు ఈ పిక్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరుని కలవడంతో చిన్ననాటి కల నెరవేరినట్టుగా ప్రశాంత్ తెలియజేశాడు. కాగా, ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లు అర్థం వచ్చేలా ఆ ట్వీట్ చేశారు. ఈ విషయం నిజమే అనే అర్థం వచ్చేలా రామ్ చరణ్, డీవీవీ దానయ్య ట్వీట్ చేశారు.