Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్ ఇచ్చారు.. లైవ్ లోనే రివ్యూలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం మొత్తం కూడా లాభాల్లోనే ఈ సినిమా కొనసాగుతోంద. అసలు ఎవరూ ఊహించని విధంగా మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటూ ఉన్నారు. ఒక విధంగా ఆయన కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా వాల్తేరు వీరయ్య ఒక రికార్డును క్రియేట్ చేసింది.
అయితే వాల్తేరు వీరయ్య సినిమా యుఎస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ సందర్భంగా యూఎస్ ఆడియన్స్ తో లైవ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మెగాస్టార్ వారి ప్రేమలకు ఆప్యాయతలకు ఎంతగానో మురిసిపోయారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలపై కూడా మెగాస్టార్ ఊహించిన విధంగా ఒక స్వీట్ కౌంటర్ అయితే ఇచ్చారు.

యూఎస్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పడినప్పుడు కేవలం 2.25 రేటింగ్ మాత్రమే ఇచ్చారు అని అప్పుడు కానీ సినిమా ఇప్పుడు ఊహించిన విధంగా 2.25 విలియన్ డాలర్స్ ను యుఎస్ లో అందుకోవడం విశేషమని మెగాస్టార్ అదిరిపోయేలా ఒక కౌంటర్ అయితే ఇచ్చారు. రివ్యూ నెంబర్ కు తగ్గట్టుగా కలెక్షన్స్ రావడం అనేది విశేషం అని ఆయన ఆడియన్స్ తో చాలా ఆనందంగా చెప్పుకున్నారు.
ఇక వీలైనంతవరకు మిమ్మల్ని మరింత ఆనందంగా ఎంటర్టైన్ చేయడానికి తాను ప్రయత్నం చేస్తాను అని మీ నుంచి వచ్చే సపోర్ట్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది అని కూడా ఆయన చాలా పాజిటివ్గా ఫ్యాన్స్ తో చర్చించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి నెక్స్ట్ బోలా శంకర్ అనే సినిమా రాబోతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరింత డిఫరెంట్ గా కనిపించబోతున్నారు.