twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi: కాలేజ్ ఫ్రెండ్స్ తో మెగాస్టార్ పార్టీ.. యంగ్ గా లేకపోతే అంత డబ్బు రాదంటూ జోక్స్

    |

    మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తన మాటలతో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక వేదిక ఏదైనా సరే తను మాట్లాడే సందర్భం వస్తే అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్నో మంచి మాటలు చెబుతూ ఉంటారు. అలాగే సరదాగా జోకులు కూడా వేస్తూ ఉంటారు. ఇక ఇటీవల అతను చదువుకున్న స్నేహితులతో గెట్ టు గెదర్ పార్టీలో పాల్గొన్నారు. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ హాజరు కాగా ఆయన మాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

     అనుకున్నంత డబ్బు రాదు

    అనుకున్నంత డబ్బు రాదు

    ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇప్పటికి నేను యంగ్ గా కనిపించడానికి కారణం భుక్తి కోసమే. సినిమాలలో యంగ్ గా కనిపించకపోతే మాత్రం నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసుకోవాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే మనం అనుకున్నంత డబ్బు రాదు. అది ఎంత రాబట్టాలి అంటే మనం అంత యంగ్ గా కనిపించాలి. అందుకే అలా ప్రయత్నం చేస్తుంటాను. ఆ రకంగా వ్యాయామాలు చేస్తుంటాను. డైట్ కూడా చేస్తుంటాను. అలా ఎన్నో త్యాగాలు చేయడం వల్లనే ఇలా యంగ్ గా ఉండవచ్చునేమో అని మెగాస్టార్ చిరంజీవి సరదాగా వివరించారు.

     మేకప్ వేసుకోండి..

    మేకప్ వేసుకోండి..


    ఇక మార్నింగ్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వస్తున్నారు అనగానే మీరు మీలాగా రాకండి.. కొంచెం యంగ్ గా కనిపించడం కోసం మేకప్ వేసుకోండి. రంగులు వేసుకోండి అని అన్నాను. ఎవరికైనా పరిచయం చేస్తే చిరంజీవి స్నేహితులను చూసి ఆయన వయసు మరీ ఇంత ఎక్కువ అని అనుకుంటారు అని మెగాస్టార్ మరోసారి నవ్వుతూ చెప్పారు. అయితే నేను అలా చెప్పేసరికి కొంతమంది యంగ్ గా కనిపించడానికి ట్రై చేశారు. కానీ అలా అనిపించడం లేదు అని మరింత నవ్వించారు.

    యంగ్ అంటే..

    యంగ్ అంటే..

    అయితే మనం ఎంత యంగ్ గా ఉన్నాము అనేది ఫిజికల్ గా కాదు. మన మనసు ఆలోచనలతో యంగ్ గా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అది నేను ప్రధానంగా ఫాలో అవుతాను. అదే మనల్ని ఎంతో బ్యూటిఫుల్ గా ఉంచుతుంది. నల్లని రంగులు వేసుకుని బాడీ కొంచెం తగ్గిస్తే అది యంగ్ అని నేను అనుకోను. మన ఆచరణ ఆలోచన విధానం కూడా యంగ్ గానే ఉండాలి. ప్రయత్నాలు స్నేహాలు అన్నీ కూడా యంగ్ అనే తరహా లోనే ఉండాలి. ఆ పాజిటివ్ హార్ట్ కోసమే నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను.

    అదొక శాపం లాంటింది

    అదొక శాపం లాంటింది

    ఎవరో ఒకరు చెప్పారు. మనిషికి రెండు ఫ్యాకల్టీస్ అనేవి వరం లాంటివి.. అవే శాపం లాంటివి కూడా అని. ఒకటి మెమోరీ రెండవది ఇమేజినేషన్. మెమొరీలో మనం కాలేజీ రోజులను చాలా వరకు గుర్తు తెచ్చుకోవచ్చు. చాలా సరదాగా మాట్లాడుకుంటాం. కానీ గతంలో జరిగిన చేదు అనుభవాలను పదేపదే గుర్తు చేసుకుంటే అది మంచిది కాదు. అది ఒక శాపం లాంటిది దాన్ని తిరిగి మార్చలేము.

    స్ఫూర్తిదాయకంగా..

    స్ఫూర్తిదాయకంగా..

    ఇక మనం ఇమేజినేషన్ లో భవిష్యత్తును కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాము. రాబోయే రాబోయే కాలంలో ఇలా జరుగుతుందేమో అని అనుకుంటాము. ఇలా అవుతుందేమో అని అనుకుంటాము. అలాంటి ఇమేజినేషన్ వలన ఆందోళనకు గురవుతూ ఉంటాం. దానివల్ల మన హెల్త్ కూడా పోతుంది. అందుకే అది మనిషికి మరొక శాపమని దాని నుంచి కూడా దూరంగా ఉండాలి అని చిరంజీవి చాలా స్ఫూర్తిదాయకంగా వివరణ ఇచ్చారు.

    English summary
    Megastar chiranjeevi at get to gather party special speech video viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X