For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Megastar Chiranjeevi: వారెవ్వా.. మెగాస్టార్ మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్లినట్లు ఉంది!

  |

  మెగాస్టార్ చిరంజీవి తెరపై ఎలాంటి పాత్రలో కనిపించినా కూడా అభిమానులు ఒక రేంజ్ లో సంబరపడిపోతున్నారు. మెగాస్టార్ వయసు ఎంత పెరుగుతున్నా కూడా స్టైల్ ను మాత్రం అదే తరహాలో కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త కిక్ ఇస్తున్నాడు. వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా నేటి తరం యువ హీరోల తరహాలోనే ట్రెండ్ సెట్ చేస్తున్నాడు.

  ఇక సినిమాల విషయంలో కూడా మెగాస్టార్ ఆలోచన విధానం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ అందులోనే కావలసిన మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. ఇక ఆయన సెలెక్ట్ చేసుకున్న దర్శకులు కూడా అభిమానులు కావడంతో మెగాస్టార్ ను అంతకుమించి అనేల ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

  వెండితెరపై తిరుగులేదని అర్థమయ్యేలా..

  వెండితెరపై తిరుగులేదని అర్థమయ్యేలా..

  రాజకీయాలకు పూర్తిగా దూరంగానే ఉంటున్నా మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తరువాత చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా తోనే బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను మరోసారి బయట పెట్టాడు. అంతేకాకుండా బాడీ లాంగ్వేజ్ లో కూడా అదే ఎనర్జీని చూపిస్తూ సరికొత్త ఇచ్చాడు. అభిమానులు ఆప్యాయత కూడా ఏమాత్రం తగ్గలేదు అని అర్థమైంది. వెండితెరపై ఆయనకు ఏమాత్రం తిరుగులేదని కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ సినిమా అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సైరా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి పెద్ద గాడు డూప్ లేకుండా సన్నివేశాల్లో నటించడం గ్రేట్ అని చెప్పవచ్చు.

  మళ్లీ 30 ఏళ్లు వెనక్కి

  మళ్లీ 30 ఏళ్లు వెనక్కి

  ఇక ఆ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరింత స్పీడ్ పెంచాడు ఏ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీ కావాలని సిద్ధమవుతున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన లేటెస్ట్ ఫోటో లుక్స్ తో ప్రేక్షకులను మరింతగా ఆశ్చర్యపరిచాడు.

  ఆ లుక్ చూసిన అభిమానులు మెగాస్టార్ చిరంజీవి మళ్లీ 30 ఏళ్లు వెనక్కి వెళ్ళినట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు. స్మార్ట్ లుక్ తో పాటు టీ షర్ట్ జీన్స్ లో నేటి యువ హీరోల కంటే కూడా చాలా కూల్ గా కనిపించారు. ఫిట్నెస్ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కాస్త మార్పులు చేసినట్లు అర్థమవుతోంది.

  సినిమాలో అలా కనిపించనున్న మెగాస్టార్

  సినిమాలో అలా కనిపించనున్న మెగాస్టార్

  ఇక మెగాస్టార్ లో ఈ స్థాయిలో మార్పు రావడానికి గల కారణం ఏమిటంటే.. ఆచార్య అనంతరం ముఖ్యమైన సినిమాలను లైన్ లో పెట్టమన్నాడు ఇప్పటికే అన్ని సినిమాలకు సంబంధించిన లుక్స్ పై ఓ క్లారిటీకి వచ్చేశారు. బాబి దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  దాదాపు ఏడాది పాటు స్క్రిప్టు పై కూర్చున్న బాబీ ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడు. ఇక హీరోలు లుక్ పై కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా మారినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ స్టూడెంట్ గా కూడా కనిపిస్తాడని సమాచారం. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్తో సాగుతుందట. సెకండ్ ఆఫీస్ లో మెగాస్టార్ చిరంజీవి పక్క బిన్నమైన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

  రిలీజ్ ఎప్పుడంటే..

  రిలీజ్ ఎప్పుడంటే..

  దర్శకుడు బాబి అభిమానులను దృష్టిలో ఉంచుకుని కథను కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి సందేశం కూడా ఇచ్చేలా రెడీ చేసుకున్నాడట మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల నుంచి మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.

  మెగాస్టార్ ను మెప్పించకపోవడంతోమరోవైపు లూసిఫర్ రీమేక్ ని కూడా తెరపైకి తేవాలని చూస్తున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాను కూడా వచ్చే ఏడాది విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. ఈ సినిమాలో ఒక యువ హీరో ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మొదట సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వివి.వినాయక్, సుజిత్ వంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఎవరు కూడా మెగాస్టార్ ను మెప్పించకపోవడంతో మోహన్ రాజాకు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ దర్శకుడు నెలరోజుల్లోనే స్క్రిప్ట్ ను తనదైన శైలిలో సిద్ధం చేసుకోవడంతో చిరంజీవి సింగిల్ సిట్టింగ్ లోనే అతన్ని ఫిక్స్ చేసుకున్నాడు.

  Farhan Aktha - Definitely Will Act If The Opportunity Arises To Act In Tollywood | Filmibeat Telugu
  మెహర్ రమేష్ తో సినిమా ఎప్పుడంటే?

  మెహర్ రమేష్ తో సినిమా ఎప్పుడంటే?

  అలాగే మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమాను కూడా రిలీజ్ చేయాలని మెగాస్టార్ ఇదివరకే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. శక్తి, షాడో వంటి డిజాస్టర్ సినిమాల అనంతరం మెహర్ రమేష్ ఎవరూ అంతగా నమ్మలేదు. అయితే గతంలో అతను కొన్ని రీమేక్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ ఆ కోణంలోనే ఆలోచించే మెహర్ రమేష్ కు అవకాశం ఇస్తున్నాడు. అప్పటికే అతను కూడా స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో పట్టాలి కావచ్చని సమాచారం.

  English summary
  Megastar chiranjeevi new stylish look like young age. Director meher ramesh remuneration for megastar chiranjeevi vedalam remake
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X