twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ సీక్రెట్ రివీల్ చేసిన చిరంజీవి.. ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది అంటూ

    |

    మెగాస్టార్ చిరంజీవి తన నట ప్రస్థానానికి సంబందించిన టాప్ సీక్రెట్ రివీల్ చేశారు. పునాది రాళ్లు వేసుకొని కెరీర్ బిల్డ్ చేసుకున్న చిరు.. అంచలంచెలుగా ఎదిగి నేడు టాలీవుడ్ రారాజుగా కీర్తించబడుతున్నారు. ఇప్పటివరకు 150 సినిమాలు పూర్తిచేసిన ఆయన తాజాగా జరిగిన మహానటుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తన కెరీర్ కి సంబంధించి మునుపెన్నడూ చెప్పని సీక్రెట్ చెప్పేశారు. జర్నలిస్ట్ సంజయ్ కిషోర్ రూపొందించిన ఎస్.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి మహానటుడు పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ లో జరిగింది.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ..''ఎస్వీఆర్ నా ఆరాధ్య నటుడు. ఆయనంటే నాకు అపారమైన అభిమానం. నా కెరీర్ ప్రారంభం నుంచి నా అభిమాన నటులెవరంటే ఎస్వీఆర్- సావిత్రి- కన్నాంబ పేర్లు మాత్రమే చెబుతుంటాను. ముఖ్యంగా ఎస్వీఆర్ నటన చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. నటనలో ఆయనో ఎన్ సైక్లో పీడియా'' అన్నారు. ఎస్వీఆర్ వల్లనే తనకు నటుడు అవ్వాలన్న కోరిక కలిగిందని, రంగారావు గారిపై అభిమానమే అలా భీజం పడేందుకు కారణమైందని టాప్ సీక్రెట్‌ని రివీల్ చేశారు చిరు.

    Megastar Chiranjeevi Reveals a Secret in Latest Event

    రావుగోపాలరావు గారి మొదటి సినిమా 'జగత్ కిలాడీలు'కి నాన్నగారు అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన నటించడానికి ఇన్స్పిరేషన్ రంగారావుగారే అని చిరు తన బయోగ్రఫీలో ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పారు. సీన్ అయ్యాక రావుగోపాలరావు గారితో డైలాగులు అనేవి రబ్బరులా సాగతీస్తూ చెప్పకూడదు. అప్పడం నమిలినట్టు అలవోకగా చెప్పేయాలి అని ఎస్వీఆర్ ఓ సారి అన్నారట. నాకది ఇప్పటికీ ఓ టిప్లా అనిపిస్తుందని.. ఎస్వీఆర్ సహజసిద్ధమైన నటన తనకు స్ఫూర్తి అని చిరు చెప్పుకొచ్చారు. చరణ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు కూడా రంగారావు గారి సినిమాలు చూసి ఇన్స్‌పెయిర్ కావాలని చెప్పానని చిరు ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.

    ఎస్వీఆర్ గనక మన దేశంలో కాకుండా మరో దేశంలో పుట్టుంటే ప్రపంచం కీర్తించే మహానుబావుడు అయ్యుండేవారు అని గుమ్మడి గారు చెప్పేవారు. కానీ అలాంటి గొప్ప నటుడు తెలుగు వాడు కావడం మన అదృష్టం అని నేనంటాను. నాకు నటనలో అంతలా స్పూర్తినిచ్చిన వ్యక్తిని ఒక్కసారి కూడా చూడలేకపోయానే ఫొటో కూడా తీయించుకోలేదే అనే లోటు బాధపెడుతుంటుందని చిరు తెలపడం విశేషం.

    English summary
    Megastar Chiranjeevi attended as a cheif guest of Mahanatudu book opening. In this event chiru told some interesting issues in his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X