twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పుడు తలుపు తట్టినా సహాయం చేసేందుకు సిద్ధమే.. వాళ్ళు నా కంటే పెద్దవాళ్ళు: చిరంజీవి

    |

    మెగాస్టార్ చిరంజీవి మిగతా హీరోల మాదిరిగా కాకుండా ఇండస్ట్రీలో ఏ మంచి కార్యక్రమం జరిగిన కూడా అక్కడికి వెళ్లి తన వంతు సహాయం అందిస్తూ ఉంటారు. ఇక తన మద్దతు కూడా ఇప్పుడు ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రపురి కాలనీలో నూతన గృహ సముదాయ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అయితే ఆ వేడుకలో ఆయన మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    మెగాస్టార్ మాట్లాడుతూ..

    మెగాస్టార్ మాట్లాడుతూ..

    ముందుగా సొసైటీ చైర్మన్ అనిల్ గారికి సెక్రటరీ దురై గారికి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన సి.కళ్యాణ్, భరద్వాజ్ గారికి నా నమస్కారాలు. అలాగే ప్రత్యేకించి ఇప్పటికీ విచ్చేసినటువంటి ఎఫ్డిసి చైర్మన్ అనిల్ గారికి అలాగే అలాగే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి కూడా మిగతా కమిటీ సభ్యులందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.. అని చిరంజీవి అన్నారు.

     20 సంవత్సరాల క్రితం..

    20 సంవత్సరాల క్రితం..

    ఈరోజు తాను బిజీగా ఉన్న సరే అనిల్ గారు తప్పకుండా రావాలి అని చెప్పారు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకత గురించి చెప్పారు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన కాలనీకి శంకుస్థాపన జరిగింది. అందుకే ఈ రోజు ప్రత్యేకతను చెప్పడంతో నా పనులు అన్నిటిని కూడా పక్కనపెట్టి ఈ వేడుకకు రావాలని అనుకున్నాను. అప్పట్లో కూడా సింగిల్ బెడ్ రూమ్ లు ఇచ్చినప్పుడు కూడా ఎంతో సంతోషంగా వచ్చాను.. అని చిరంజీవి చెప్పారు.

    ఇదొక గొప్ప విషయం

    ఇదొక గొప్ప విషయం

    ఇక మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత కొత్తగా వచ్చిన కమిటీ మెంబర్లు అందరూ కూడా వీటిని అనుకున్న టైంకి ఇవ్వాలి అని చేసిన కృషి కనిపించింది. ఏ కార్మికుడైన సరే ఏ కష్టజీవికైనా సరే ఒక సొంత ఇల్లు ఉండటం అనేది పెద్ద డ్రీమ్. ఆ కల ఈరోజు నిజమవ్వడం అనేది గొప్ప విషయం. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారికి మనం ప్రత్యేకంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆలోచన విధానం వల్లనే ఈ కల సాకరమైంది.. అని చిరంజీవి చెప్పారు.

     ఎక్కడా లేని విధంగా..

    ఎక్కడా లేని విధంగా..

    ప్రభుత్వాలు కూడా వీటికి సపోర్ట్ చేయడం కూడా గొప్ప విషయం. ప్రపంచంలో ఎక్కడా లేనిది కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ లోనే ఒక సినీ కార్మికుల కోసమే ఇక్కడ గృహ సముదాయం అనేది ఉండడం ఒక మంచి విషయం. మధ్యలో కొన్ని అవక తవకలు జరిగినాయి అన్నారు. వాటి గురించి నాకు తెలియదు. వాటి గురించి నేను మాట్లాడను. కానీ ఈ కమిటీ.. అనిల్ దొరై మాత్రం సారధ్యంలో నిజాయితీతో చేసుకుంటూ వెళ్లారు.. అని చిరంజీవి చెప్పారు.

    నేను పెద్ద అని అంటున్నారు

    నేను పెద్ద అని అంటున్నారు

    అలాగే సి కళ్యాణ్ గారు కూడా వారి గురించి గొప్పగా చెప్పారు. ఇక ఇదే తరహాలో భవిష్యత్తులో కూడా నిజాయితీతో వెళ్లాలి అని కోరుకుంటున్నాను. ఇక ఏ అవసరం ఉన్నా సరే నా వైపు నుంచి ఉండాల్సిన సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ సి. కళ్యాణ్ భరద్వాజ్ కొంతమంది నేను పెద్ద అని అంటున్నారు. వాళ్లు నాకంటే చిన్నవాళ్ళు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్లు ముదుర్లు నా కంటే పెద్దవాళ్ళు. వారికి అయితే సపోర్ట్ గా నేను ఉంటాను.. అని చిరంజీవి చెప్పారు.

    సహాయం చేసేందుకు సిద్ధమే

    సహాయం చేసేందుకు సిద్ధమే

    ఈ సినీ కార్మికుల కుటుంబాలకు ఎప్పుడూ కూడా నేను సపోర్ట్ గా ఉంటాను. భగవంతుడు నాకు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఇక భవిష్యత్తులో వారికి కృతజ్ఞతగా నేను కృతజ్ఞతగా రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తాను. అవసరం వచ్చినప్పుడు మాత్రం నేను భుజం కాస్తాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక నా ఇంటి తలుపులు తడితే ఎప్పుడైనా సహాయం చేసేందుకు సిద్ధమే అని మరోసారి తెలియజేసుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు.. అని చిరంజీవి చెప్పారు.

    English summary
    Megastar chiranjeevi superb speech at chitrapuri colony warning ceremony
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X