మేనల్లుడిపై మెగాస్టార్ స్పెషల్ ఫోకస్.. నిహారిక పెళ్లి అవ్వగానే మరో వేడుక

మెగా ఫ్యామిలీలో ఎలాంటి శుభకార్యం జరిగినా అందులో అన్నయ్య ఉండాల్సిందే. ఇక వారి యువ హీరోలకు ఒక బాట వేసి వారి కంటూ ఒక కెరీర్ ని సెట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి వారి వ్యక్తిగత జీవితంలో కూడా బంగారు బాట వేసేందుకు రెడీగా ఉంటారు. మెగా వారసుల పెళ్లిళ్లు మొత్తం ఆయన నిశ్చయం చేసినవే. నిహారిక పెళ్లి నిశ్చయంలో కూడా చిరంజీవి పాత్ర ఎంతో ఉంది. ఇక ఇప్పుడు మరోసారి యువ హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై కూడా మెగాస్టార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేయాల్సిందే..

పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేయాల్సిందే..

మెగా ఫ్యామిలీలో మారికొన్ని రోజుల్లో నిహారిక పెళ్లి గ్రాండ్ గా జరగబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా నిర్వహించినప్పటికి పెళ్లిని మాత్రం గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నారు. కరోనా హడావుడి పూర్తిగా తగ్గిన తరువాతనే పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. కుదిరితే డిసెంబర్ లోనే ముహూర్తం ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు.

మెగాస్టార్ పెట్టిన మొదటి రూల్

మెగాస్టార్ పెట్టిన మొదటి రూల్

అసలు మ్యాటర్ లోకి వస్తే మెగా ఫ్యామిలీలో అబ్బాయిలు మూడు పదుల వయసులోకి రాకముందే పెళ్లి చేసుకోవాలనేది మెగాస్టార్ చిరంజీవి పెట్టిన మొదటి రూల్. దాదాపు రామ్ చరణ్ అదే వయసులో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ రూల్ ని సాయి ధరమ్ తేజ్ క్రాస్ చేశాడు. కెరీర్ వలన కాస్త ఆలస్యం కావడంతో మెగాస్టార్ కూడా అర్థం చేసుకొని ఏమనకుండా దగ్గరుండి ఇటీవల ఒక సంబంధం చూశారని తెలుస్తోంది.

మెగాస్టార్ బ్యాక్ గ్రౌండ్ ప్లాన్..

మెగాస్టార్ బ్యాక్ గ్రౌండ్ ప్లాన్..

గత వారం రోజులుగా సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన పెళ్లి వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఈ పెళ్లి కుదరడంలో పెద్దగా వ్యవహరిస్తోంది మెగాస్టార్ గారే. ఆయన సోదరితో మాట్లాడి ఒక మంచి అమ్మాయిని చూశానని, మన కుటుంబంలో కలిసి పోయేలా ఉంటుందని చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నారట.

Recommended Video

Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
నిహారిక పెళ్లి అవ్వగానే..

నిహారిక పెళ్లి అవ్వగానే..

సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయాన్ని తన కుటుంబ సభ్యులకు వదిలేసినట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. ముఖ్యంగా పెద్ద మామయ్య చూసుకుంటున్నారు అన్నప్పటి నుంచి పెళ్లి మ్యాటర్ లో టెన్షన్ లేకుండా నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడట. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి అయిపోగానే సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై ఫోకస్ పెట్టాలని మెగాస్టార్ ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X