twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆరెంజ్‌తో కోలుకోలేని దెబ్బ.. చచ్చిన తర్వాత డబ్బు ఎందుకు? అంబానీని టార్గెట్ అంటూ నాగబాబు

    |

    మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే. రాంచరణ్‌తో అరెంజ్ సినిమా తీసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఆ క్రమంలో తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకొన్నాననే విషయాన్ని నాగబాబు తన యూట్యూబ్ నా ఛానెల్ నా ఇష్టంలో వెల్లడించారు. ఆయన ఏమని చెప్పారంటే

    అరెంజ్ ఫ్లాప్ తర్వాత అలాంటి కష్టాలు

    అరెంజ్ ఫ్లాప్ తర్వాత అలాంటి కష్టాలు

    ఆరెంజ్‌ సినిమాతో నా జీవితంపై గట్టిగానే దెబ్బ పడింది. కోలుకోలేనంతగా ఆర్థిక నష్టాలు వచ్చాయి. దాంతో సినిమాల్లో నటించడం, టీవీ సీరియల్స్, టీవీ షోలు చేయడం మొదలుపెట్టాను. 2010లో నెలకు తక్కువలో తక్కువగా నాకు 1,50.000 అవసరం ఉండేది. అయితే ఆ సమయంలో నా ఆదాయం లక్ష రూపాయలే. అంటే నా ఆర్థికంగా 50 వేల లోటుతో జీవితం సాగేది అని నాగబాబు చెప్పారు.

     ఆరెంజ్ తర్వాత ప్రతీ అవకాశాన్ని

    ఆరెంజ్ తర్వాత ప్రతీ అవకాశాన్ని

    ఆరెంజ్ మిగిల్చిన ఆర్థిక నష్టాలతో మానసికంగా కుంగిపోవాల్సిన పరిస్థితి. కానీ అలా నేను కుంగిపోలేదు. చాలా మంది నాకు అండగా నిలిచారు. అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొన్నాను. అపరంజి, శిఖరం లాంటి టీవీ సీరియల్స్, జబర్దస్త్ లాంటి కామెడీ షో ప్రారంభించాను. దాంతో నా ఆదాయం పెరిగింది అని నాగబాబు తెలిపారు.

    ప్రతీ ఆర్నెళ్లకు ఓ టార్గెట్

    ప్రతీ ఆర్నెళ్లకు ఓ టార్గెట్

    ప్రతీ ఆర్నెళ్లకు డబ్బు సంపాదించే టార్గెట్‌ను సెట్ చేసుకొనే వాడిని. తొలి ఆర్నెళ్లలో 3 లక్షల టార్గెట్ పెట్టుకొంటే.. మరో ఆర్నెళ్లకు దానిని మించి టార్గెట్ పెట్టుకొన్నాను. ఏడాదికి ఏడాది టార్గెట్ మార్చుకొన్నాను. 10 ఏళ్లో నేను ఓ టార్గెట్ సెట్ చేసుకొని ముందుకు వెళ్లాను. తొలి టార్గెట్ సెట్ చేసుకొన్నప్పుడు అద్బుతంగా సినిమా ఆఫర్లు రాలేదు. అయినా చిన్న చితక సినిమాలు చేస్తూ నా టార్గెట్‌ను పూర్తి చేసుకొనే ప్రయత్నం చేశాను అని నాగబాబు పేర్కొన్నారు.

    ఇప్పుడు నేను నా టార్గెట్ రీచ్ అయ్యా

    ఇప్పుడు నేను నా టార్గెట్ రీచ్ అయ్యా

    2010 జనవరిలో ప్రారంభమైన 3 లక్షల టార్గెట్ 2016 నాటికి 7 లక్షలు పెట్టుకొన్నాను. ప్రస్తుతం నేను పెట్టుకొన్న టార్గెట్‌ను చక్కగా చేరుకొన్నాను. డబ్బు సంపాదించడానికి లైఫ్‌లో ప్లాన్ ఉండాలి. నేను చనిపోయే వరకు 50 కోట్లు సంపాదించాలని టార్గెట్ సెట్ చేసుకోవడం కంటే.. ఎప్పటికప్పుడు చిన్న చిన్నగా టార్గెట్ చేసుకోవడం మంచిదనే నా ప్లాన్. మనం చనిపోయే వరకు ఇంత సంపాదించాలనే లక్ష్యం పెట్టుకోవడం వేస్ట్. బతికి ఉన్నప్పుడే డబ్బు సంపాదిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని నాగబాబు తెలిపారు.

    Recommended Video

    Keerthy Suresh's Telugu Debut Aina Ishtam Nuvvu Teaser
    బతికి ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి..

    బతికి ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి..

    ప్రతీ వ్యక్తి జీవితంలో లగ్జరీగా ఉండాలనుకోవడం, బాగా సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం సరైన ప్లానింగ్ ఉండాలి. విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనే టార్గెట్ లేకపోతే అర్థం ఉండదు. వాహనంలో ప్రయాణించేటప్పుడు మనం జీపీఎస్ ఉపయోగిస్తాం. ఎక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్లాలనే విషయాన్ని టైప్ చేసి డైరెక్షన్ బటన్ నొక్కితే మన గమ్యస్థానాన్ని చేరుస్తుంది. జీపీఎస్ మాదిరిగానే డబ్బు సంపాదన కోసం మనం ఎక్కడ మొదలయ్యాం.. ఎక్కడికి చేరుకోవాలి అనే విషయాన్ని నిర్ధిష్టంగా ప్లాన్ చేసుకోవాలి. ఉన్నట్టుండి అంబానీలా డబ్బు సంపాదించాలనే కోరిక సరైనది కాదు అని నాగబాబు పేర్కొన్నారు.

    English summary
    Mega Brother and Actor Naga babu revealed Money earning strategy. Nagababu said that After Orange movie disaster he went into heavy loses. After that lose, He made plan for survie him and his family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X