చరిత్ర సృష్టించిన నటసింహం బాలకృష్ణ.. సౌత్ ఇండియాలో ఏకైక హీరోగా రికార్డు!

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, వైద్య రంగంలో సామాజిక సేవతో ప్రజలు, ప్రేక్షకులకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే పలు రంగాల్లో తనకంటూ మార్కును, మైలురాయిని క్రియేట్ చేసుకొంటూ తన సత్తాను చాటుతున్నారు. సినిమా పరంగా రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఆయన అభిమానులకు, సన్నిహితులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. అయితే తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో అరుదైన గౌరవాన్ని అందుకొన్న ఏకైక హీరోగా ఓ ఘనతను సాధించారు. ఆయనకు దక్కిన గౌరవం గురించిన వివరాల్లోకి వెళితే..

స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ తనకంటూ ఎదురులేని ఇమేజ్‌ను సంపాదించుకొన్నారు. అందుకే ఆయనను అందరూ గాడ్ ఆఫ్ మాసెస్‌గా పిలుచుకొంటారు. నటుడిగా, ప్రజా ప్రతినిధిగా, రియాలిటీ షో హోస్ట్‌గానే కాకుండా తల్లి స్మారకంగా పెట్టిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తరపున సామాజిక సేవల్లో భాగమవుతున్నారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ బాధితులకు చేదోడుగా తమ వంతు సహాయం అందిస్తున్నారు.

Nandamuri Balakrishna

తన తల్లి బసవతారకం పేరిటి నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్‌ను దేశంలోనే అత్యున్నత సేవలు అందిస్తున్న హాస్పిటల్‌గా తీర్చిదిద్దారు. పేద, ఆర్ధికంగా వెనుకబడిన క్యాన్సర్ బాధితులకు తమదైన శైలిలో సేవలు అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయనను వరించాయి. తాజాగా జాతీయ స్టాక్ మార్కెట్‌ కూడా ఆయనను ప్రత్యేకంగా గౌరవించింది.

Nandamuri Balakrishna

సామాజిక, ఆరోగ్య రంగాల్లో తనదైన రీతిలో ప్రభావం చూపుతున్న నందమూరి బాలకృష్ణకు, ఆయన అందిస్తున్న సేవలకు గుర్తుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ అధిపతులు, సంఘ సంస్కర్తలకు, జాతీయ నేతలకే పరిమితైన ఓ ఘనత తాజాగా బాలకృష్ణను ఆపాదించింది. ముంబైలోని ఎన్ఎస్ఈ (NSE) కార్యాలయంలో గంట మోగించే అరుదైన అవకాశాన్ని ఆయన అందుకొన్నారు. దక్షిణాది సినిమా రంగం నుంచి ఈ ఘనతను సాధించిన తొలి సినీ హీరోగా చరిత్రను సృష్టించారు.

Nandamuri Balakrishna

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం బాలయ్యను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అలాగే మొన్నీ మధ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి కూడా ఆయన పేరు నమోదైంది. ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొంటున్న బాలయ్య ఇక ముందు మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం కావాలని అభిమానులు కోరుకొంటున్నాను. సినిమాకెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన అఖండ 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X