బాలకృష్ణను హర్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. బాలయ్య రివెంజ్ ఇలా
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బాలకృష్ణ తండ్రి అడుగు జాడల్లోనే అగ్రనటుడిగా వెలుగొందుతున్నారు. పౌరాణిక, జానపద, చారిత్ర, సాంఘిక, సైన్స్ ఫిక్సన్ ఇలా అన్ని రకాల జోనర్స్‌లో నటించిన హీరోగా నిలిచారు బాలయ్య. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ.. 40 ఏళ్లుగా టాలీవుడ్‌ను మోస్తున్న నలుగురు అగ్రహీరోలలో ఒకరిగా నిలిచారు. 65 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లని మించిన స్పీడ్‌తో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అలాంటి బాలయ్యను ఓ టాలీవుడ్ స్టార్ హీరో బాగా హర్ట్ చేశాడట. ఆ హీరో ఎవరు? బాలయ్య లాంటి బిగ్‌స్టార్‌ను ఎందుకు పెళ్లికి పిలవలేదు? ఈ వివరాల్లోకి వెళితే..
అన్‌స్టాపబుల్‌తో బాలయ్యలో మరో కోణం
నటన, రాజకీయాలతో దూసుకెళ్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కార్యక్రమం. అల్లు అరవింద్ సారథ్యంలోని తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య హోస్ట్‌గా ప్రసారమైన ఈ మెగా టాక్ షో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ఐఎండీబీ రేటింగ్ పొందింది. నటుడిగానే కాదు.. హోస్ట్‌గానూ తనకు తిరుగులేదని బాలయ్య నిరూపించుకున్నారు. అన్‌స్టాపబుల్ కార్యక్రమం ద్వారానే ఆహా ఓటీటీకి పాపులారిటీతో పాటు సబ్‌స్క్రైబర్లు పెరిగారు.

అల్లు అరవింద్ స్ట్రాటజీ సూపర్
హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణను తీసుకురావాలన్న అల్లు అరవింద్ స్ట్రాటజీ అన్ని రకాలుగా వర్కవుట్ అయింది. ఈ షోకు పవన్ కళ్యాణ్ , మహేశ్ బాబు, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని , శర్వానంద్, గోపీచంద్ సహా పలువురు హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి టాప్ పొలిటిషీయన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్‌లో బాలయ్య క్రేజ్
తన అల్లరి, మేనరిజం, ఇంటర్వ్యూ చేసే విధానంతో బాలయ్య కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ షో తర్వాత బాలకృష్ణకు పిల్లలు, మహిళా ప్రేక్షకుల్లోనూ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పటికీ నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ మెగా షో త్వరలో ఐదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంతమందిని ఇంటర్వ్యూ చేసినా ఇంకా ఈ టాక్ షోకు హాజరు కావాల్సిన సెలబ్రెటీల లిస్ట్ కూడా భారీగానే ఉంది. చిరంజీవి, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌లను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
బాలయ్యను హార్ట్ చేసిన హీరో
అయితే ఈ కార్యక్రమానికి తొలి సీజన్‌లోనే సూపర్‌స్టార్ మహేశ్ బాబు హాజరై బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ బాబు పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఒక్క విషయంలో నీ మీద నాకు బాగా కోపం.. ఒకే ఇండస్ట్రీ, పొద్దున లేస్తే ముఖాలు చూసుకుంటాం కనీసం పెళ్లికి కూడా పిలవలేదని మహేశ్‌తో చెబుతూ బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసేసుకున్నావ్, అంత సీక్రెట్ ఏంటీ? అని బాలకృష్ణ ప్రశ్నించారు. దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ.. 'ఇది 15 ఏళ్ల క్రితం జరిగింది. ఆ టైంలో ఫస్ట్ నాన్నగారిని ఒప్పించాలి, అమ్మాయి (నమ్రత) కూడా చాలా మంచిది, మీరు వెళ్లి కలవండని చెప్పా. నమ్రతను కలిసిన వెంటనే నాన్నగారు గోహెడ్ అని చెప్పారు. మిగిలిన వాళ్లని పిలవటం ఎందుకని ప్రైవేట్‌గా పెళ్లి చేసేసుకున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు మేం చాలా సంతోషంగా ఉన్నాం' అని మహేశ్ బాబు ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











