twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Thanks meet పాకిస్థాన్‌లో అఖండ జోరు.. వాట్సప్‌లో అలాంటి మెసేజ్ అంటూ బాలకృష్ణ ఎమోషనల్

    |

    నటసింహ, బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శించబడుతూ.. 50 రోజుల పండుగను జరుపుకొనేందుకు పరుగులు పెడుతున్నది. ఇలాంటి పండుగ లాంటి వాతావరణంలో అఖండ చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ జరుపుకొన్నది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..

    బోయపాటి శ్రీను కథ చెప్పడానికి వస్తే..

    బోయపాటి శ్రీను కథ చెప్పడానికి వస్తే..

    బోయపాటి శ్రీనుతో సినిమా అంటే డిస్కషన్స్ ఉండవు. కట్టె.. కొట్టె.. తెచ్చే అనే విధంగా ఉంటుంది. బోయపాటి వచ్చి కథ చెప్పడం, నేను వినడం ఉండదు. సీన్లు, సన్నివేశాల గురించి చర్చ ఉండదు. బోయపాటి కథ చెప్పడానికి వస్తున్నాడంటే నేను తప్పించుకొని తిరుగుతాను. అందుకు కారణం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం. ఆ నమ్మకమే అఖండ లాంటి విజయాన్ని అందించింది అని బాలకృష్ణ అన్నారు.

    అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులు

    అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులు

    అఖండ చిత్రం కేవలం మహిళలనే కాదు.. అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. సినిమా చూసిన ప్రతీ ఒక్కడు కంటతడి పెట్టకుండా థియేటర్ నుంచి బయటకు రాలేదు. అఖండ చిత్రం ధర్మం గురించి చెప్పిన సినిమా. ఒక పాత్ర ధర్మాన్ని బోధిస్తే.. మరో పాత్ర ప్రకృతికి అండగా నిలుస్తుంది. పసిపాపలను, ప్రకృతిని కాలరాస్తే ఎలా ఉంటుందని చాటి చెప్పిన చిత్రం అఖండ. అందుకే ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది అని బాలకృష్ణ చెప్పారు.

    నిర్మాత సాహోసోపేతమైన నిర్ణయం

    నిర్మాత సాహోసోపేతమైన నిర్ణయం

    కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో, ఏపీలో టికెట్ రేట్ల వివాదం మధ్య ఎవరూ సినిమాలను విడుదల చేయాడానికి సాహసించని నేపథ్యంలో అఖండ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ సినిమాను ఎలాగైనా థియేటర్లలో రిలీజ్ చేయాలని సాహోసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొన్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేయాలి. సంక్రాంతి పండుగ సంబురాల్లో ఈ సినిమా భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ బాలకృష్ణ అన్నారు.

    అన్ సీజన్‌లో అఖండ విజయం

    అన్ సీజన్‌లో అఖండ విజయం

    అఖండ చిత్రం ప్రతికూల పరిస్థితుల్లో రిలీజై.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. డిసెంబర్ 2న రిలీజ్ చేసిన పరిస్థితులు సినిమాకు అనుకూలం కాదు. అన్ సీజన్‌లో చిత్రాన్ని రిలీజ్ అందర్ని మెప్పించాం. చాలా రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బండ్లు కట్టుకొని సినిమా చూసేందుకు వచ్చారు. ఇలాంటి విశేషత అఖండకే దక్కింది అని బాలకృష్ణ చెప్పారు.

    పాకిస్థాన్‌లో కూడా అఖండ ప్రదర్శన

    పాకిస్థాన్‌లో కూడా అఖండ ప్రదర్శన

    అఖండ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. దాంతో ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమానే కాకుండా ప్యాన్ వరల్డ్ సినిమాగా నిలిచింది. పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారనే విషయం చాలా సంతోషం కలిగించింది. పాకిస్థాన్‌లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారనే విషయం వాట్సాప్‌లో ఓ వీడియో నాకు నా మిత్రుడు షేర్ చేశారు. స్వచ్ఛమైన మనసుతో అంకితభావంతో విజయం లభిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులు రుజువు చేశారు అని బాలకృష్ణ తెలిపారు.

    సినిమా పరిశ్రమకు అఖండ టానిక్

    సినిమా పరిశ్రమకు అఖండ టానిక్

    అఖండ చిత్రం సినీ పరిశ్రమకు ఉత్తేజం ఇచ్చింది. సంక్షోభంలో ఉన్న సినిమా పరిశ్రమకు అఖండ విజయం ఓ టానిక్‌లా పనిచేసింది. సినిమా విజయం మాకు బరువు కాదు. నేను, బోయపాటి బరువు పెంచిందని అనుకోం. ప్రతీ విజయం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని భావిస్తున్నాం. మా చిత్రంతోపాటు విడుదలైన మిగితా చిత్రాలు కూడా భారీ విజయాన్ని అందుకొన్నాయి. పెద్ద, చిన్నా సినిమా అనే తేడా లేకుండా విజయం సాధించాలి. ప్రభుత్వాలు సహకారం అందించాలి అని బాలకృష్ణ వెల్లడించారు.

    English summary
    Nandamuri Balakrishna's Akhanda running successful in Theatres. This movie is going to celebrate 50 days function soon. In this occassion, Akhanda team organised Thanks meet in hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X